Let's talk: editor@tmv.in
బేగంపేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం

బేగంపేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం

Panthagani Anusha
13 అక్టోబర్, 2025

హైదరాబాద్‌లోని బేగంపేట్‌లోని గ్రీన్ ల్యాండ్స్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి, రాపిడో మోటార్‌సైకిల్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డాక్టర్‌తో సహా బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల సమాచారం ప్రకారం, సికింద్రాబాద్ వైపు ప్రయాణిస్తున్న రాపిడో బైక్‌ను లారీ బలంగా ఢీకొట్టింది. లారీ డీ కొట్టిన తీవ్రత బలంగా ఉండటంతో బైక్ నడుపుతున్న రాపిడో డ్రైవర్ వెనుక కూర్చున్న ప్రయాణికుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మృతుల వివరాల ప్రకారం రాపిడో డ్రైవర్ ఎం. నవీన్ ఖమ్మం జిల్లా నివాసి ప్రస్తుతం ఉద్యోగ నిమిత్తం జేఎన్టీయూ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇక ప్రయాణికుడైన డాక్టర్ జగదీష్ చంద్రగా గుర్తించారు

.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను గుర్తించడంతో పాటు, లారీ వేగం, ఇతర సాంకేతిక వివరాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు విచారణ అనంతరం బయటపడతాయని పోలీసు అధికారులు తెలిపారు.

బేగంపేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం - Tholi Paluku