Let's talk: editor@tmv.in
బెయిలొచ్చాక మిథున్ రెడ్డికి ప్రత్యేక గౌరవం

బెయిలొచ్చాక మిథున్ రెడ్డికి ప్రత్యేక గౌరవం

FL - SIMHCLM
8 అక్టోబర్, 2025

బయటకు అనుకోవడానికి చాలా ఉంటాయి కానీ.. లోలోన జరిగేది వేరే ఉంటుంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. అయన రాజకీయంగా ప్రతిష్టను కోల్పోయారు.. ఇక ఆయనకు కేంద్రంలో విలువ తగ్గిపోతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం లేనట్లే.. వైయస్ జగన్ కు కుడిభుజం లాంటి మిథున్ రెడ్డి అరెస్ట్ తో ఇక ఆ పార్టీకి ఢిల్లీలో పునాదులు కదిలినట్లే అని చాలా అభిప్రాయాలు వచ్చాయి .. కానీ సీన్ చూస్తే మిథున్ రెడ్డికి అరెస్ట్ తరువాత ఇమేజి పెరిగినట్లు తెలుస్తోంది.. అయన గౌరవమర్యాదలు ఏమాత్రం భంగం వాటిల్లకపోగా ఆయనకు మరింత ప్రాముఖ్యత లభించింది.

ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సుకు వెళ్లే 16 మంది ఎంపీల టీమ్ లో వైసీపీకి చెందిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్లడం ఆసక్తిని పెంచుతోంది. ఐక్యరాజ్య సమితి 80వ జనరల్ అసెంబ్లీ కి ఇండియా నుంచి వెళుతున్న ఎంపీల ప్రతినిధి బృందంలో మిధున్ రెడ్డి ఉండడం విశేషం అయితే ఏపీ నుంచి ఆయన ఒక్కరే ఉండడం మరో విశేషం. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఈ భారతీయ బృందానికి నాయకత్వం వహిస్తుండగా ఈ బృందంలో తెలుగుదేశం.. జనసేన నుంచి ఒక్కరు కూడా సభ్యులుగా లేకపోగా మిథున్ రెడ్డికి మాత్రం అవకాశం దక్కింది. ఈ నెల 27న న్యూయార్క్ లో జరిగే ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారతీయ ఎంపీల బృందం పాల్గొంటుంది.

కేంద్రంలోని ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న టీడీపీకి ఏపీలో 16 మంది ఎంపీలు జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నా వారిని ఈ సదస్సుకు తీసుకెళ్లడం లేదు. కానీ లోక్ సభలో కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్న వైసీపీ నుంచి ఆ పార్టీ నేత అయిన మిధున్ రెడ్డిని ఎంపిక చేయడం గమనార్హం. దీంతో జగన్ కు ఎప్పటికీ మోడీ సపోర్ట్ ఉందని టీడీపీ సోషల్ మీడియా కామెంట్లు చేస్తోంది.

బెయిలొచ్చాక మిథున్ రెడ్డికి ప్రత్యేక గౌరవం - Tholi Paluku