Let's talk: editor@tmv.in
బెంగుళూరు కేసులో భర్తే అసలు హంతకుడు

బెంగుళూరు కేసులో భర్తే అసలు హంతకుడు

Panthagani Anusha
16 అక్టోబర్, 2025

బెంగళూరు నగర వైద్య వర్గాలను కుదిపేసిన మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన యువ వైద్యురాలు కేసు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. మొదట సహజ మరణంగా భావించిన ఈ ఘటన, తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్‌ నివేదికతో హత్య కేసుగా మారింది. మృతురాలి శరీరంలో మత్తు మందు ఆనవాళ్లు బయటపడటంతో, పోలీసులు ఆమె భర్త, మరో డాక్టర్‌పై హత్య ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటన బెంగళూరు వైద్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు డాక్టర్ కృతికా ఎం. రెడ్డి (28), ఒక ప్రముఖ వ్యాపారవేత్త కె. ముని రెడ్డి కుమార్తె.కాగా కృతిక 2024 మే 26న మహేంద్ర రెడ్డిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కొద్ది కాలానికే భర్త నుంచి ఒత్తిడి, వేధింపులు ప్రారంభమైనట్లు కృతిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మహేంద్ర రెడ్డి తనను నిర్మించాలన్న పెద్ద ఆసుపత్రి కోసం ఆర్థిక సహాయం చేయాలని మామగారు ముని రెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు, అందుకోసం కృతికను తరచూ వేధించినట్లు ఫిర్యాదులో తెలిపారు. కూతురి పరిస్థితి అర్థం చేసుకున్న ముని రెడ్డి మరాఠాహళ్లిలో “స్కిన్ & స్కాల్పెల్‌ క్లినిక్‌”ను ఏర్పాటు చేసి ఇచ్చినా మహేంద్ర డిమాండ్లు తగ్గలేదని తండ్రి వాపోయారు.

అయితే కృతిక మరణానికి ముందు జరిగిన సంఘటనలు పరిస్థితిని మరింత అనుమానాస్పదంగా మార్చాయని, కాగా కృతిక చనిపోవడానికి మూడురోజుల ముందు అంటే ఏప్రిల్ 21న కడుపు నొప్పి ఉందని కృతిక చెప్పడంతో ఆమెకు భర్త మహేంద్ర ఇంట్లోనే ఇంట్రావీనస్‌ (ఐవి) మందు ఇచ్చాడు. తదుపరి రోజు ఏప్రిల్ 22న కృతికను విశ్రాంతి కోసం తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లి, అదే రోజు రాత్రి మరోసారి ఐవి డోస్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 23న ఐవి ఇచ్చిన చోట నొప్పి ఉందని బాధితురాలు చెప్పినా వినకుండా మహేంద్ర ఆ లైన్‌ను తొలగించకుండా మూడవ డోస్‌ ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం ఏప్రిల్ 24న కృతిక స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు పరిశీలించినప్పుడు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఫోరెన్సిక్ నివేదికతో బయటపడిన నిజాలు

మరణానంతరం జరిగిన పోస్ట్‌మార్టమ్ కి సంబంధించి తాజాగా అందిన ఫోరెన్సిక్ నివేదికల్లో కృతిక శరీరంలో మత్తు మందుల ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ ఆధారాలపై పోలీసులు మంగళవారం డాక్టర్‌ మహేంద్ర రెడ్డిపై హత్య కేసు నమోదు చేశారు

.కాగా పోలీసులు మత్తుమందును ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా ఉపయోగించారు, దాని మోతాదు ఎంత అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా కృతిక మరణం వెనుక ఆర్థిక ఒత్తిడి, కుటుంబ విభేదాలు కూడా కారణమా అనే దిశలో విచారణ కొనసాగుతోంది.

బెంగుళూరు కేసులో భర్తే అసలు హంతకుడు - Tholi Paluku