Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో అవినీతి రాజ్యమేలుతోంది: బీజేపీ నేత సయ్యద్ బాషా

బెంగాల్‌లో అవినీతి రాజ్యమేలుతోంది: బీజేపీ నేత సయ్యద్ బాషా

Panthagani Anusha
30 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని 15 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు పెరిగిపోయాయని బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

అవినీతికి అడ్డాగా బెంగాల్: సయ్యద్ బాషా

ఆంధ్రప్రదేశ్ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ బాషా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మమత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత 15 ఏళ్లలో బెంగాల్‌లో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న వారి వల్ల రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే సరిహద్దులను పూర్తిగా మూసివేసి, అక్రమ చొరబాటుదారులకు చెక్ పెడతామని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మే 4న చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

అస్సాంలోనూ అదే జోరు

మరోవైపు అస్సాంలో కూడా 126 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మరోసారి జెండా ఎగురవేయాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన పాత నియోజకవర్గమైన ‘జలుక్బారి’ నుంచే మళ్ళీ పోటీ చేస్తున్నారు.

బెంగాల్‌లో అవినీతి రాజ్యమేలుతోంది: బీజేపీ నేత సయ్యద్ బాషా - Tholi Paluku