Let's talk: editor@tmv.in
బెంగళూరులో యువతి దారుణ హత్య

బెంగళూరులో యువతి దారుణ హత్య

Panthagani Anusha
19 అక్టోబర్, 2025

ఈ మధ్యకాలంలో మహిళలపై అరాచకాలు పెరురుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు అని చెప్పడానికి మరోదారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ తాజా ఘటనలో ప్రేమ పేరుతో వేధింపులు ఎదుర్కొన్న 20 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కసి, ఆగ్రహంతో పొరుగింటి యువకుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ దుర్ఘటన అక్టోబర్ 16వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో శ్రీరాంపుర ప్రాంతంలో జరిగింది. ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న యామిని ప్రియ (20) అనే విద్యార్థిని కళాశాల నుంచి తన నివాసమైన స్వతంత్ర పాల్మాకు ఒంటరిగా తిరిగి వస్తున్న సమయంలో ఆమె ఇంటి పక్కన నివసించే ప్రధాన నిందితుడు విఘ్నేష్ (28) ఆమెను మార్గమధ్యంలో అడ్డగించాడు. కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్న విఘ్నేష్, ఆ రోజు కూడా తీవ్రంగా ఒత్తిడి చేశాడు. అయితే విఘ్నేష్ ప్రతిపాదనను యమిని ప్రియ ఖరాఖండిగా తిరస్కరించడంతో అతను మరింత ఆగ్రహం లోనై తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి, ఆమెపై అతి కిరాతకంగా దాడి చేసి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు లాక్కెళ్లి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది.

ఇక బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శ్రీరాంపుర పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా విచారణలో భాగంగా నిందితుడు విఘ్నేష్ గత కొంత కాలంగా తమ కుటుంబాన్ని వేధిస్తున్నట్లు తేలింది. ఇక దర్యాఫ్తువేగవంతం చేసిన పోలీసు బృందం హత్య చేసి పరారైన విఘ్నేష్‌ను, అతనికి ఆశ్రయం కల్పించిన మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు అదేవిదంగా నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై స్పందించిన ఉత్తర బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) బి. ఎస్. నేమగౌడ ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ ప్రధాన నిందితుడు విఘ్నేష్ కు పూర్వ నేరచరిత్ర చరిత్ర ఉన్నట్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం .నిందితులను లోతుగా విచారిస్తున్నాం. పూర్తి వివరాలు,. ఒకటి లేదా రెండు రోజుల్లో హత్యకు గల పూర్తి కారణాలను తెలుసుకుని నేరస్థులకు తగిన శిక్ష పడేలా చేస్తామని ,నేమగౌడ హామీ ఇచ్చారు.

ఇలాంటి ఘటనలు మరెన్నో

• హైదరాబాద్‌లో 2018లో, ఉద్యోగ సహచరుడి ప్రపోజల్‌ను తిరస్కరించినందుకు 24 ఏళ్ల మహిళను కత్తితో పొడిచి హత్య చేశాడు. గుజరాత్‌లో 16 ఏళ్ల బాలిక పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో నిందితుడు ఆమెను 32 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు.

• ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో,ఓ వ్యక్తి పెళ్లి ప్రతిపాదన తిరస్కరించబడడంతో ఆ యువతిని, ఆమె బంధువును హత్య చేశాడు.

• గుజరాత్‌లో 16 ఏళ్ల బాలిక పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో నిందితుడు ఆమెను 32 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు.