
బీహార్ లో అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం జోరందుకున్న లాబీయింగ్
బీహార్లో స్పీకర్ పదవి కోసం ఎన్డీఏ కూటమిలోని నాయకులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించిన తర్వాత, అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారని శనివారం అధికార ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఈ రేసులో గయా టౌన్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా తొమ్మిదోసారి ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ ముందున్నారు. ఆయన పార్టీలోని అత్యంత సీనియర్ నాయకులలో ఒకరైనందున స్పీకర్ పదవికి పోటీలో ముందంజలో ఉన్నట్లు వారు తెలిపారు. అలాగే జేడీయూకి చెందిన ఝా ఎమ్మెల్యే దామోదర్ రావత్ పేరు కూడా వినిపిస్తోందని వారు తెలిపారు. త్వరలో ఎన్నికైన 243 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి స్పీకర్‌ను ఎన్నుకునేలా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
నవంబర్ 25న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీని నిర్ణయిస్తామని ఎన్డీఏ నాయకులు తెలిపారు. ముందుగా గవర్నర్ ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు, ఆయన కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణం చేయిస్తారు. సభ్యులు ప్రమాణం చేసిన తర్వాత, స్పీకర్ ఎన్నిక జరుగుతుందని ఎన్డీఏ భాగస్వామికి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. ఎన్డీఏలోని రెండు ప్రధాన భాగస్వామ్య పక్షాలు - బీజేపీ, జేడీయూ స్పీకర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నాయని ఆ తెలిపాయి.
ఇప్పుడు కూటమి భాగస్వాముల మధ్య స్పీకర్ పదవి కోసం లాబీయింగ్ తీవ్రమైందని జేడీయూ నాయకుడు ఒకరు అన్నారు. లాబీయింగ్ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. మా సీనియర్ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ స్పీకర్ పదవి చేపట్టడానికి అన్నివిధాల అర్హులు. ఆయనే ఈ పోటీలో ముందు వరుసలో ఉన్నారని బిజెపికి చెందిన ఒకరు అన్నారు.గత ఎన్డీఏ ప్రభుత్వంలో సహకార మంత్రిగా ఉన్న ప్రేమ్ కుమార్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అఖౌరీ ఓంకార్ నాథ్‌ను 26,423 ఓట్ల తేడాతో ఓడించారు. 2015, 2017 మధ్య బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన పనిచేశారు.
ఝా ఎమ్మెల్యే దామోదర్ రావత్ కూడా పోటీలో ఉన్నారని జేడీయూ వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీలో, బిజెపి నాయకుడు నంద్ కిషోర్ యాదవ్ స్పీకర్‌గా పనిచేశారు, జేడీయూ కు చెందిన నరేంద్ర నారాయణ్ యాదవ్ డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టారు. బీజేపీకి చెందిన అవధేష్ నారాయణ్ సింగ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ పదవిని నిర్వహిస్తున్నందున, అసెంబ్లీ స్పీకర్ పదవి నితీష్ కుమార్ పార్టీకి ఇవ్వాలని జేడీయూ నాయకులలో ఒక వర్గం కోరుతోందని ఆ వర్గాలు తెలిపాయి. స్పీకర్ పదవి కోసం ఎన్డీఏలోని జేడీయూ,బీజేపీ పోటీపడుతున్నాయి.
ప్రొటెం స్పీకర్ గా హరినారాయణ్ సింగ్?
ఈ సారి ప్రొటెమ్ స్పీకర్‌గా జేడీయూకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే హరినారాయణ్ సింగ్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రోటెం స్పీకర్ గా మొత్తం సభలో సీనియర్ సభ్యుడిని నియమిస్తారు. ఈయన పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే వయస్సులోనూ పెద్దవారు కావడంతో ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే వీలుంది.
