Let's talk: editor@tmv.in
బీహార్ ఫలితాలపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు

బీహార్ ఫలితాలపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు

Gaddamidi Naveen
15 నవంబర్, 2025

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు సహకరించిన ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో బీహార్‌ అంతటా పర్యటించిన ఆయన, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ తమ లోపాలను గుర్తించుకుని సీరియస్‌గా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

మీడియాతో మాట్లాడిన ఒవైసీ, బీహార్‌ ప్రజలకు నా కృతజ్ఞతలు. మొదటి నుంచి నేనే చెబుతున్నాను ఆర్జేడీ బీజేపీని ఆపలేదని. నా ప్రసంగాల్లో కూడా ఇదే చెప్పాను. ‘ఎం–వై’ (ముస్లింలు–యాదవులు) కలయికపై ఉన్న భ్రమ నుంచి బయటకు రావాలని అక్కడి ప్రజలకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.కొంత మంది ఓటర్లను ఉద్దేశిస్తూ ఆయన, మీరు ఎప్పటికీ ‘వోట్‌ గివర్స్‌’గా కాకుండా ‘వోట్‌ టేకర్స్‌’గా మారాలి. అలా మారితే మీ సమాజంలో నాయకత్వం పెంపొందుతుంది. అదే సమయంలో సామాజిక, మత ఆధారిత ద్వేష రాజకీయాలకు కూడా అడ్డుకట్ట వేయవచ్చు అని వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడంలో విఫలమైన ఆర్జేడీ, ఇతర రాజ్యేతర పార్టీలు తమ పనితీరును సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. మన మీద విమర్శలు చేసి, దూషణలు చేస్తే సంతోషపడేవాళ్లే కావచ్చు. కానీ అది సమస్యలకు పరిష్కారం కాదు అని అన్నారు.ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఒవైసీ, మహాఘటబంధన్‌ ఓటమిని ఇతరులపై నెడుతూ ప్రచారం చేయడం బదులుగా, తమ బలహీనతలను గుర్తించడం రాజ్యేతర పార్టీల పని అని స్పష్టం చేశారు. మీరే పెద్దవాళ్లమని, ప్రజలు ఆటోమేటిక్‌గా మీకే ఓటేస్తారని భావించే కాలం ముగిసిపోయిందని.వినయం ఉండాలని, ప్రజలు కాదు, ఓటర్లు రాజులు” అని ఒవైసీ స్పష్టం చేశారు.

బీహార్ ఫలితాలపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు - Tholi Paluku