
బీహార్ ఎన్నికల ఓటమిపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాకూటమి' ఓటమి చెందిన తరువాత, కాంగ్రెస్ అగ్ర నాయకులు ఈ ఫలితంపై తీవ్రమైన ఆరోపణలు, అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు:
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం "నిజంగా ఆశ్చర్యకరమైనది" అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు "మొదటి నుంచీ అన్యాయంగా జరిగాయి" అని ఆరోపించారు. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, రెండంకెల సీట్లు కూడా సాధించలేకపోవడం ఈ ఆరోపణలకు కారణంగా నిలిచింది.
"మహాకూటమిపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసిన బీహార్‌లోని కోట్లాది మంది ఓటర్లకు నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీహార్‌లో ఈ ఫలితం నిజంగా ఆశ్చర్యకరమైనది. మొదటి నుంచీ నిష్పక్షపాతంగా జరగని ఎన్నికల్లో మేము విజయం సాధించలేకపోయాము. ఈ పోరాటం రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే. కాంగ్రెస్ పార్టీ 'ఇండియా' కూటమి ఈ ఫలితాన్ని లోతుగా సమీక్షించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ ప్రయత్నాలను మరింత బలంగా ముందుకు తీసుకువెళ్తాయి."
ఆయన తన ఎక్స్ వేదికగా ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య హత్య అని అభివర్ణించారు. లక్షలాది మంది బీజేపీ సభ్యులు వివిధ రాష్ట్రాల్లో బహిరంగంగా తిరుగుతూ ఓట్లు వేస్తున్నారు. ఈ దొంగతనాన్ని కప్పిపుచ్చడానికి, సాక్ష్యాలన్నీ తుడిచివేయబడుతున్నాయి. బీజేపీ ఈసీ (ఎన్నికల సంఘం) కలిసి బహిరంగంగా ఓట్లను దొంగిలిస్తున్నాయి ప్రజాస్వామ్య హత్య ప్రత్యక్షంగా జరుగుతోంది.అన్నారు.
జైరాం రమేష్ వ్యాఖ్యలు:
మరో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మరింత తీవ్రంగా స్పందించారు. 'మహాకూటమి' ఓటమికి కారణం "ఓట్ల చోరీ” అని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల సంఘం లను "దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్"గా అభివర్ణించారు.
"ఎటువంటి సందేహం లేదు, బీహార్ ఎన్నికల ఫలితాలు భారీ స్థాయిలో ఓట్ల చోరీని ప్రతిబింబిస్తున్నాయి. దీనికి ప్రధానమంత్రి, హోం మంత్రి, మరియు ఎన్నికల సంఘం మాస్టర్ మైండ్స్‌గా వ్యవహరించారు." ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ "రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం" అనే తమ పోరాటానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
