Let's talk: editor@tmv.in
బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం ‘సీఎం మోహన్‌ యాదవ్‌’

బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం ‘సీఎం మోహన్‌ యాదవ్‌’

Gaddamidi Naveen
9 నవంబర్, 2025

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ మాట్లాడుతూ, తొలి దశలో నమోదైన అధిక ఓటింగ్‌ శాతంఎన్డీఏ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. నవంబర్‌ 6న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని, రాష్ట్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అధిక ఓటింగ్‌ శాతం ఎన్డీఏ పక్షాన ప్రజల ఉత్సాహాన్ని చూపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ విజయవంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్లే, బీహార్‌లో కూడా ఎన్డీఏ మరోసారి ఘనవిజయం సాధించబోతోంది, అని మోహన్‌ యాదవ్‌ తెలిపారు.అదే సమయంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ఆయన, ఎన్నికల సమయంలో తన పార్టీని వదిలి సెలవుల్లోకి వెళ్లిపోవడం రాహుల్‌ గాంధీ ఓటమిని ముందుగానే అంగీకరించినట్టే. ఆయన మధ్యప్రదేశ్‌ వస్తే అతిథిగా స్వాగతిస్తాం కానీ, కాంగ్రెస్‌ నేతగా ఆయన వైఖరి పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.

బీహార్‌ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ప్రకారం, నవంబర్‌ 6న జరిగిన తొలి దశ పోలింగ్‌లో 18 జిల్లాల 121 నియోజకవర్గాల్లో సగటుగా 65.08 శాతం ఓటింగ్‌ నమోదైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది 57.29 శాతం కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 56.28 శాతంగా ఉంది. అంటే, ఈసారి ఓటర్ల పాల్గొనడంలో గణనీయమైన 7.79 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు తెలిపారు.

రెండో దశ పోలింగ్‌ నవంబర్‌ 11న జరగనుంది. ఆ దశలో 20 జిల్లాల 122 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. అన్ని దశల పోలింగ్‌ ముగిసిన తర్వాత నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం ‘సీఎం మోహన్‌ యాదవ్‌’ - Tholi Paluku