Let's talk: editor@tmv.in
బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేతల నియామకం

బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేతల నియామకం

Gaddamidi Naveen
31 డిసెంబర్, 2025

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శాసనసభ, శాసనమండలిలో పార్టీ నేతృత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నియామకాలు చేపట్టారు. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేతలు(డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు)గా సీనియర్ నేతలు ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను నియమించారు. ఈ ముగ్గురు నేతలు సభలో పార్టీ వ్యూహాలను సమర్థంగా అమలు చేయడంతో పాటు, ప్రభుత్వ విధానాలపై బలమైన వాదనలు వినిపించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అదేవిధంగా శాసన మండలిలో బీఆర్‌ఎస్‌ ఉప నేతలుగా ఎల్‌.రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, విప్‌గా దేశపతి శ్రీనివాస్‌లను నియమిస్తూ కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నియామకాలతో శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర మరింత బ‌ల‌ప‌డ‌నుంది.