
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభివృద్దిలో విఫలమయ్యాయి: దీపక్ రెడ్డి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్ ర్యాలీ సందర్భంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం విజయదుర్గ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైలాండ్ కాలనీ నుంచి భారీ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు “భారత్ మాతా కి జై” నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది.
ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన బీజేపీ నేతలు ఈ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ దిశను మార్చే అవకాశముందని పేర్కొన్నారు. లంకల దీపక్ రెడ్డి మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు.అలాగే, కాంగ్రెస్ పార్టీకి తమ సొంత అభ్యర్థి దొరకక మజ్లిస్ పార్టీ మద్దతుతో పోటీ చేయడం వారి రాజకీయ బలహీనతకు నిదర్శనమని పేర్కొన్నారు. సోమవారం మనం దీపావళి జరుపుకున్నాం, నవంబర్ 14న దీపక్ రెడ్డి విజయం మరో దీపావళిగా నిలుస్తుందని ఆయన అన్నారు.
అలాగే ఈ ర్యాలీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కనీసం రాత్రి పూట వీధి దీపాలు కూడా పెట్టించలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. గత పది ఏళ్ల నుంచి జూబ్లీహిల్స్ అభివృద్ధి చేపట్టని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలను ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించి బీజేపీని గెలిపించాల్సిందిగా ఓటర్లను ఆయన కోరారు. అలాగే రాష్ట్రాంలో కానీ, జూబ్లీహిల్స్ లో కానీ ఒక మహిళకు అన్నా తులం బంగారం, ఇచ్చినవా? ఆరు హామీలను అమలు ఇంకా జరగలేదుని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ర్యాలీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కిషన్ విశ్వేశ్వర రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. బీజేపీ నేతలు ఈ ఉపఎన్నికలో ప్రజలు అభివృద్ధి, నిష్పాక్షికతకు మద్దతు ఇవ్వాలని, రాష్ట్ర రాజకీయాలలో మార్పుకు ఇది నాంది కావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్‌తో చేతులు కలిపాయి
ఈ ర్యాలీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ విజయానికి మజ్లిస్ పార్టీ మద్దతు ఉంటే, 11 ఎకరాల పెద్దమ్మ గుడి భూమి మజ్లిస్ కి బహుమతిగా ఇవ్వబడే అవకాశముందని పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడం ప్రధాన లక్ష్యమని చెప్పడం వలన, జూబ్లీహిల్స్‌లో ఎందుకు పోటీ చేయడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇప్పటికే మజ్లిస్ తో రూ.200 కోట్ల రాయితీ ఒప్పందాలు చేసుకున్నాయని, అందుకే ఈ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ ప్రత్యర్థిగా రాకపోవడని బండి పేర్కొంటున్నారు. బీజేపీ ఈ ఉపఎన్నికలో మజ్లిస్ –కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పొరపాట్లను బయటకు తీయడానికి ప్రధాన లక్ష్యంగా సన్నద్ధమవుతోందని తెలిపారు. పార్టీ నేతలు ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ, తమ అభ్యర్థి విజయానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
