Let's talk: editor@tmv.in
‘బాణసంచా’పై విశాఖ సీపీ నజర్

‘బాణసంచా’పై విశాఖ సీపీ నజర్

FL - YUGDR
6 అక్టోబర్, 2025

బాణసంచా అక్రమ నిల్వలు, తయారీ వ్యాపారంపై విశాఖ పోలీసులు నిఘా పెంచారు. దీపావళి నేపథ్యంలో తనిఖీల్ని ముమ్మరం చేయాలంటూ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభ్రత బగ్బీ ఆదేశించారు. భీమిలిలో బాణసంచా పేలి పలువురికి తీవ్ర గాయాలవ్వడంతో సీపీ బగ్చీ అప్రమత్తమయ్యారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలకు ఉపక్రమించారు.

పోలీస్ కమిషనర్ ఆదేశాలతో బాణసంచా నిల్వలపై టాస్క్ఫోర్స్ పోలీసులు శని, ఆది వారాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. పెందుర్తి, ఆనందపురం, ఎంవీపీ, గోపాలపట్నం, భీమిలి పరిధిలోని పలువురి వ్యాపారులు, గోదాముల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకుని, ఐదుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించామని టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ భరత్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

‘బాణసంచా’పై విశాఖ సీపీ నజర్ - Tholi Paluku