Let's talk: editor@tmv.in
బీహార్ బీజేపీ​ ఎన్నికల ఇంచార్జ్​‌గా ధర్మేంద్ర ప్రధాన్​

బీహార్ బీజేపీ​ ఎన్నికల ఇంచార్జ్​‌గా ధర్మేంద్ర ప్రధాన్​

Pinjari Chand
26 సెప్టెంబర్, 2025

ఆయా రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల కోసం బీజేపీ ముమ్మర కసరత్తులు చేస్తోంది. గురువారం బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌​ లను నియమించింది. బీహార్ ఎన్నికలు అక్టోబర్​ లేదా నవంబర్​ లో జరిగే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం ఇంకా ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించలేదు. బెంగాల్ ఎన్నికలు 2026లో జరగనున్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే ఎన్నికల సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బీహార్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా, మరో మంత్రి భూపేంద్ర యాదవ్‌ను పశ్చిమ బెంగాల్‌ ఇన్‌చార్జ్‌ గా బాధ్యతలను అప్పగించింది .

ప్రధాన్‌తో పాటు, బీజేపీ నాయకులు,గుజరాత్ యూనిట్ చీఫ్ సిఆర్ పాటిల్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలను బీహార్‌కు సహ-ఇన్‌ఛార్జులుగా పంపనుంది. త్రిపుర మాజీ సీఎం, ప్రస్తుత త్రిపుర పశ్చిమ నియోజకవర్గ ఎంపీగా ఉన్న బిప్లవ్​ కుమార్ దేబ్, పశ్చిమ బెంగాల్‌లో పార్టీ వ్యవహారాల నిర్వహణకు సహ-ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు .

ఎన్డీఏ కూటమి బీహార్‌లో తన పట్టును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బందన్ నితీష్ కుమార్‌ను గద్దె దించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులలో ఎన్డీయేకు 131 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో బీజేపీకి 80 , జేడీయూ-45 , హెచ్​ఎఎంఎస్​-4 , 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.ప్రతిపక్షానికి చెందిన మహాఘట్బందన్​ కు 111 మంది సభ్యుల బలం ఉంది, ఆర్జేడీ 77 మంది ఎమ్మెల్యేలతో, కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-11, సీపీఐ(ఎం)-2, సీపీఐ-2 ఎమ్మెల్యేలు ఉన్నారు.

బీహార్ బీజేపీ​ ఎన్నికల ఇంచార్జ్​‌గా ధర్మేంద్ర ప్రధాన్​ - Tholi Paluku