Let's talk: editor@tmv.in
బీహార్​ ఎన్నికల షెడ్యూల్​ పై ఊహగానాలు

బీహార్​ ఎన్నికల షెడ్యూల్​ పై ఊహగానాలు

Pinjari Chand
23 సెప్టెంబర్, 2025

దేశం దృష్టంతా త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలపైనే ఉంది. ఎందుకంటే ఎవరైతే బీహార్​, ఉత్తరప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారో,తరువాత జరిగే లోక్​‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతారని ఓ నమ్మకం ఉంది. దీంతో రాష్ట్రంపై పట్టు కోసం ఆయా కూటములు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్బంగా రాష్ట్రంలో జరిగే ఎన్నికల షెడ్యూల్​‌పై రకరకాల ఊహగానాలు బయల్దేరాయి. ఎలక్షన్​ కమిషన్​ కంటే ముందుగానే మీడియా ప్రతినిధులు తారీఖులు, విడతలతో సహ చేప్పేస్తున్నారు. అయితే అక్టోబర్​‌లో జరగుతాయని కొన్ని, నవంబర్​‌లోపు జరుగుతాయని ఇంకొన్ని చెబుతున్నాయి. దీంతో ప్రజలు గందరగోళంలో పడిపోతున్నారు. ఎన్నికల నిర్వహణపై తేదీలపై అస్పష్టత కారణంగా ప్రజలు తమ వివాహా, తదితర శుభకార్యాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అక్టోబర్, నవంబర్​ నెలల్లో శుభకార్యాలు అధికం

వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో ఎక్కువగా అనందభరితమైన కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. అత్యధికంగా ఈ కాలంలోనే బీహార్​ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రజలు అక్టోబర్​, నవంబర్​ నెలల్లోనే వివాహ తదితర శుభకార్యాలను నిర్ణయించుకుంటారు. ఇంటిల్లిపాది ఓ సంబురంలా నిర్వహించుకుంటారు. దాదాపు 5 రోజులకు పైగా పెళ్లి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. అయితే రానున్న ఎన్నికల వలన వాటిని వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రచారం పర్వం ఉదృతంగా ఉండడం, అలాగే నాయకుల తాకిడి, వారితోబాటే కార్యకర్తల రాక అలాగే ఉంటుంది. దీంతో ఆ సమయంలో వివాహాలు, తదితర కార్యక్రమాల ఖర్చు కూడా బాగా పెరిగిపోతుంది.

అలాగే రానున్న అక్టోబర్​ మాసంలో బీహార్​ వాసులు అత్యంత వైభవంగా నిర్వహించుకునే పండుగ ఛఠ్​ పూజ సంబురాలు ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు వస్తుంటారు. దీంతో అక్కడ భద్రతా చర్యలు చేపట్టడం కష్టంగా మారే అవకాశం ఉంది.

మీడియా సంస్థల అంచనాలు

ఇటీవల కొన్ని జాతీయ మీడియా సంస్థలు అక్టోబర్​లో మూడు విడతల్లో ఎన్నికలుంటాయని పేర్కొంది. మరో సంస్థ నవంబర్​ 5‌‌–15 మధ్య ఎన్నికల నిర్వహణ ఉంటుందని తేల్చాయి. మరో సంస్థ రెండు విడతల్లో ఉంటాయని జోస్యం చెప్పింది. అయితే వాటిపై ఓ ప్రణాళిక ప్రకారం వార్తలు రాయడం మంచిదే కానీ ఇలా ప్రజలను అయోమయానికి గురి చేస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆర్థిక కార్యాకలపాల నిర్వహణ కష్టంగా మారింది. అయితే ఇటువంటి ఊహజనితమైన వార్తలను విశ్వసించరాదని ఎలక్షన్​ కమిషన్​ ప్రకటించే తేదీలే మనం చూసుకోవాలని తెలిపారు.

బీహార్​ ఎన్నికల షెడ్యూల్​ పై ఊహగానాలు - Tholi Paluku