Let's talk: editor@tmv.in
బీహార్లో విద్యా రుణాలపై వడ్డీ మాఫీ

బీహార్లో విద్యా రుణాలపై వడ్డీ మాఫీ

Pinjari Chand
17 సెప్టెంబర్, 2025

రానున్న ఎన్నికలను దష్టిలో ఉంచుకుని ఇటు రాష్ట్రప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం బీహార్ పై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. మహిళలు, యువత,నిరుద్యోగులు ఇలా అందరిపై వరుస సంక్షేమ పథకాల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సీఎం నితీశ్ కుమార్ మంగళవారం స్టూడెంట్ క్రెడిట్ కార్డు పథకం కింద పై చదువులు చదివేటందుకు విద్యారుణం ఇస్తామని, అది కూడా వడ్డీ లేకుండా ఉంటుందని ప్రకటించి విద్యార్థులకు ఉపశమనం కలిగించారు.

‘ఉన్నత చదువుల కోసం విద్యారుణం కొరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ స్టూడెంట్ క్రెడిట్ కార్డు పథకం కింద వడ్డీ లేకుండా ఇస్తున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని సీఎం నితీశ్ కుమార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాగే రుణం చెల్లించడానికి ఉన్న గడువు వ్యవధిని పొడగించారు. రూ.2 లక్షల్లోపు రుణం తీసుకుంటే 7 సంవత్సరాల్లోపు వాయిదా పద్దతుల్లో చెల్లించాలి. గతంలో 5 సంవత్సరాలే ఉండేది. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలకు పది సంవత్సరాల వ్యవధి ఇచ్చారు. గతంలో 7 సంవత్సరాలుగా ఉండేది.

బీహార్లో విద్యా రుణాలపై వడ్డీ మాఫీ - Tholi Paluku