Let's talk: editor@tmv.in
బల్క్ డ్రగ్ పనులు నిలిపివేస్తాం!

బల్క్ డ్రగ్ పనులు నిలిపివేస్తాం!

FL - YUGDR
30 సెప్టెంబర్, 2025

ప్రజాభీష్టం మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్యపేట బల్క్ డ్రగ్ పనులను నిలిపివేస్తామని హోంమంత్రి అనితా ప్రకటించారు. 16 రోజులుగా రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారని, తనను రాజయ్యపేట గ్రామం రావాలని గ్రామస్తులు కోరారని సోమవారం సాయంత్రం నక్కపల్లి లో విలేకరుల సమావేశంలో చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే వస్తానని చెప్పానని, ఒకరోజు ముందుగానే రాజయ్యపేట వచ్చానని అన్నారు. బయట నుండి వచ్చిన వ్యక్తులు కూడా వచ్చారని వారే రచ్చగొడతున్నారని ఆరోపించారు.

రాజయ్యపేట గ్రామం టిడీపి కంచుకోట అని 2014, 2019, 2024 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీటి ఇచ్చారని గుర్తు చేశారు. 2024 ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్ గా రాజయ్యపేట బల్క్ డ్రగ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిందని అన్నారు. అప్పటి వైసీపీ నాయకులు ఈ సందర్భంగా పాలాభిషేకాలు చేశారని, ఎన్డియే ప్రభుత్వం లో ప్రధానమంత్రి మోదీ విశాఖలో మరల శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.

హెటిరో వల్ల ఇబ్బందులు

హెటిరో కంపెనీ వలన రాజయ్యపేట గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని, పరిష్కారానికి రాజయ్యపేట గ్రామస్తులు అన్ని పార్టీలు నాయకులు, ప్రజలతో ఒక కమీటి ఏర్పాటు చేయాలని చెప్పానని అన్నారు. సీఎం, డిప్యూటి సీఎం వద్దకు తీసుకువెళ్తానని చెప్పానని, రాజయ్యపేట ప్రజలు కోరిక మేరకు బల్క్ డ్రగ్ పార్క్ పనులు ఆపుచేయిస్తానని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మత్స్యకారులతో దయచేసి రాజకీయాలు చేయవద్దని, మత్స్యకారులకు వేట నిషేద సమయంలో మత్స్యకార సేవలో పేరుతో ఇరవై వేల రూపాయలు ఇచ్చామని చెప్పారు. మత్స్యకారులకు ఏబై సంవత్సరాలకే ఫించన్ ఇచ్చిన ఘనత చంద్రబాబుదని, రాజయ్యపేట గ్రామస్తులు చాలా మంచివాళ్లని, బయటనుండి వచ్చేవాళ్ళు రచ్చగొడతున్నారని అన్నారు. అమాయకులైన ప్రజలతో రాజకీయాలు చేయవద్దని, పోలీసులు ఎవ్వరైనా అనుచితంగా ప్రవర్తిస్తే, పోలీసులు తరుపున నేను క్షమాపణ కోరతానని స్పష్టం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో స్టీల్ ఫ్లాంట్ ను అందరు స్వాగతం పలికారని, రాజయ్యపేట ప్రజలకు తాను ఎప్పుడు న్యాయమే చేస్తానని సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు వెళతామని హామీ ఇచ్చారు.

బల్క్ డ్రగ్ పనులు నిలిపివేస్తాం! - Tholi Paluku