
బర్కత్‌పురలో యాదాద్రి అఖండ జ్యోతి యాత్రను ప్రారంభించిన కిషన్ రెడ్డి
Gaddamidi Naveen
16 ఫిబ్రవరి, 2026
నగరంలోని బర్కత్‌పుర ఆధ్యాత్మికతతో పులకించిపోయింది. యాదాద్రి భవన్ నుంచి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి 32వ అఖండ జ్యోతి యాత్ర ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ యాత్రకు పచ్చజెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా బర్కత్‌పుర పరిసర ప్రాంతాలు ‘జై నరసింహ’ నామస్మరణలతో మార్మోగాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ ఆధ్యాత్మిక శోభాయాత్ర, హైదరాబాద్ నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రం వరకు సాగనుంది. యాత్రను ప్రారంభించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మూడు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా సాగుతున్న ఈ జ్యోతి యాత్ర యాదాద్రి భక్తులకు ఒక ప్రత్యేకమైన వేడుకగా నిలుస్తోంది.
