Let's talk: editor@tmv.in
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 మేనేజర్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 మేనేజర్ పోస్టులు

Shaik Mohammad Shaffee
20 సెప్టెంబర్, 2025

తొలిపలుకు, విద్య, ఉద్యోగం:* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా తమ శాఖల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 350 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీ, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సెక్యూరిటీ, ఐఎస్ ఆడిట్, సీఐఎస్ఓ, ట్రెజరీ, ఇంటర్నేషనల్ బిజినెస్, లీగల్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ అకౌంట్స్, క్రెడిట్, సీఏ, ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ.

పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ సర్వీసుల్లో పని అనుభవం కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్/ఓబీసీ/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 1,180, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్యూబీడీ అభ్యర్థులకు రూ.118గా ఉంది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు, మూడు దశల్లో జరుగుతుంది. మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ రెండింటిలో సాధించిన మార్కులను బట్టి ఫైనల్ ఎంపిక ఉంటుంది. కొన్ని పోస్టులకు గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.64,820 నుంచి రూ.1,40,500 వేతనం లభిస్తుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్‌సైట్ https://bankofmaharashtra.in/ను సందర్శించండి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 మేనేజర్ పోస్టులు - Tholi Paluku