
బతుకమ్మ గిన్నిస్ రికార్టుపై సీఎం అభినందన
Pinjari Chand
1 అక్టోబర్, 2025
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అతి పెద్ద బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మంగళవారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని, అధికారులను సచివాలయంలో అభినందించారు. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద సంప్రదాయ నృత్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
