Let's talk: editor@tmv.in
బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

Gaddamidi Naveen
17 సెప్టెంబర్, 2025

తెలంగాణలో అత్యంత ప్రాచీనమైన, సాంస్కృతిక విలువలతో నిండిన బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ పండుగను మహిళల సమ్మేళనంగా భావించి, వారి అస్తిత్వానికి ప్రతిరూపంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో జరుపుతుంది. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా బతుకమ్మను బ్రాండ్ చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. బతుకమ్మకు సంబంధించిన పాటలను పాడుకుంటూ మహిళలు సందడిగా చేసుకుంటారు.

బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని యువ సృజనశీలురకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పొటిలు నిర్వహిస్తోసంది. 3 నిమిషాలు,5 నిమిషాల లోపు కలిగిన రెండు కేటగిరీల్లో షార్ట్ ఫిలిమ్స్ పంపించాలని ఎఫ్ డీసీ చ్తెర్మన్ దిల్ రాజు గారు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తదితరాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటల పోటీలు పంపించాలి.

సెప్టెంబర్ 30 లోపు ఎంట్రీలను పంపించాల్సి ఉంటుందని, నిర్దేశిత గడువులోగా అందిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి ఎంపిక చేస్తారని దిల్ రాజు గారు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారికి భవిష్యత్తులోనూ అనేక రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను దిల్ రాజు విడుదల చేశారు.

ఎంట్రీలను ఈ కింది మెయిల్ ఐడీ youngfilmmakerschallenge@gmail.com లేదా వాట్సాప్ నెంబర్ - 8125834009 కు పంపించాల్సి ఉంటుందని వెల్లడించారు. పోటీలో ఎంపికైన షార్ట్ ఫిలిమ్స్కు ప్రథమ బహుమతి రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష చొప్పున అందిస్తారని వివరించారు. మరో ఐదుగురికి రూ. 20 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు అందజేస్తారని ప్రకటించారు. వీటితో పాటు బహుమతి గ్రహీతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేస్తారని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు.

పోటీలో పాల్లొనడానికి అర్హతలు:

• ఈ పోటీలో పాల్గొనే వారి వయస్సు 40 ఏళ్ళ లోపు ఉండాలి

• 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.

• షార్ట్ ఫిల్మ్స్ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీల్లో సూచించిన ‘థీమ్’ల పైనే ఉండాలి.

• మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.

• బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసం మాత్రమే చిత్రీకరించినవై ఉండాలని దిల్రాజ్ సూచించారు.

బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం - Tholi Paluku