
బతుకమ్మకుంట ప్రజలకు అంకితం
బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం దసరాకు ముందుగా జరుపుకునే ఈ పండుగ మహిళల ఆత్మబలాన్ని, సంప్రదాయాన్ని, ప్రకృతి ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25న స్థానిక బతుకమ్మకుంటలో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు జరుగుతుంది. మొదటి రోజు "ఎంగిలి పూల బతుకమ్మ"గా ప్రారంభమై, చివరి రోజు "సడ్డుల బతుకమ్మ తో ముగుస్తుంది. అంబర్ పేటలోని బతుకమ్మకుంట ఈ సారి బతుకమ్మ వేడుకలకు సిద్దమవుతుంది.
ఈ నెల 25న ఇక్కడ నిర్వహించనున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. హైడ్రా అధీనంలో పునరజ్జీవనం పోందిన ఈ కుంటను అదే రోజు ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ ఏర్పాట్లను ముఖ్యమంత్రి సలహాదారు వేం. నరేంద్రర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ బతుకమ్మకుంటకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగాలని నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కబ్జాల చెర నుంచి దీనికి విముక్తి కల్పించి , సుందరంగా వీర్చడంతో హైడ్రా కృషి అభినందనీయం అని మేయర్ విజయలక్ష్మి అన్నారు. సెప్టెంబర్ 25న బతుకమ్మకుంటలో జరగబోయే బతుకమ్మ ఉత్సవం తెలుగు సంప్రదాయానికి ప్రతీక. ఇది తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ఒక గొప్ప ప్రజా పండుగ. అందరూ పాల్గొని ఆనందంగా, శాంతిగా జరుపుకోవాలని తెలిపారు.
