Let's talk: editor@tmv.in
బడి పిల్లలతో బెకమ్: అలరించిన ఫుట్‌బాల్ స్టార్

బడి పిల్లలతో బెకమ్: అలరించిన ఫుట్‌బాల్ స్టార్

Dantu Vijaya Lakshmi Prasanna
28 నవంబర్, 2025

మాజీ ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ అలాగే యునిసెఫ్ సద్భావనా రాయబారి అయిన డేవిడ్ బెకమ్‌, ఎడ్యుకేషన్ అబౌ ఆల్ ఫౌండేషన్ నుండి ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి ఇటీవల మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలను సందర్శించారు. ఈ పాఠశాల మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యా సంస్థల సొసైటీకి చెందిన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల. ఇది విశాఖపట్నం సమీపంలోని కొత్తవలసలో ఉంది. ప్రభుత్వం అట్టడుగు వెనుకబడిన తరగతుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలను నడుపుతోంది. బెకమ్‌ ఈ పాఠశాలను సందర్శించడం, అణగారిన వర్గాల పిల్లలతో సహా, అందరికీ విద్య యొక్క ప్రాముఖ్యతను చెబుతుంది.

ఆయన తరగతి గదుల్లో కలిసి విద్యార్థులు చేతితో తయారుచేసిన సంగీత వాయిద్యాలను మెచ్చుకున్నారు, విద్యార్దులకు మైదానంలో ఫుట్‌బాల్ నైపుణ్యాలను నేర్పించారు, మొక్కలు నాటడానికి సహాయం చేసారు. వెనుకబడిన తరగతులకు చెందిన ఉత్సాహభరితమైన విద్యార్థులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో సృజనాత్మక విద్య ప్రయత్నాలను ప్రోత్సాహిస్తున్న౦దుకు ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు డేవిడ్ బెకమ్‌ను ప్రశంసించారు.

ఈ సందర్శన నాలుగు గంటల పాటు చేతికి పని కల్పించే అనుభవంగా సాగింది. డేవిడ్ బెకమ్‌ తరగతి గదిలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం కార్యక్రమం లైవ్ సెషన్‌లో కూర్చున్నాడు, అక్కడ విద్యార్థులు ఇంగ్లీష్, గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులలో చర్చలకు నాయకత్వం వహించారు. అలాగే వారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు.

మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ, మొక్కల పెరుగుదల మరియు ప్రభావాన్ని ట్రాక్ చేయడానికి డిజిటల్ ఐడెంటిఫైయర్‌లను ఉపయోగించి మొలకలను స్కాన్ చేసి లేబుల్ చేయడం ఎలాగో విద్యార్థులు అతనికి చూపించారు.లైబ్రరీలో, పిల్లల ఊహలకు మార్గనిర్దేశం చేసే పుస్తకాల గురించి వారితో మాట్లాడటానికి ఒక డేవిడ్ బెకమ్‌ రీడింగ్ సర్కిల్‌లో చేరాడు.తన నేపథ్యాన్ని యునిసెఫ్ సద్భావనా రాయబారి పాత్రతో కలుపుతూ, ఉల్లాసభరితమైన "వన్-టచ్" ఫుట్‌బాల్ డ్రిల్‌తో సందర్శన ముగిసింది.

విస్తృత ఉద్యమం

ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం కార్యక్రమం మంత్ర4చేంజ్ ఎడ్యుకేషన్ అబౌ ఆల్ ఫౌండేషన్ మధ్య భాగస్వామ్యం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని 107 రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలు చేయబడింది, దాదాపు 18,000 మంది విద్యార్థులకు ఈ విధానం అందుబాటులో వుంది. ఈ వినూత్న బోధనా పద్ధతి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, నాగాలాండ్‌తో సహా పలు భారతీయ రాష్ట్రాలలో తరగతి గదులను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్న మంత్ర4చేంజ్, ఇఏఏ పని పై బెకమ్‌ సందర్శన జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భారతదేశంలోని పది లక్షల (ఒక మిలియన్) ప్రభుత్వ పాఠశాలలను మార్చడానికి మెరుగుపరచడానికి మంత్ర4చేంజ్ సహ-నిర్మాణం చేస్తున్న జాతీయ ఉద్యమం అయిన శిక్షాగ్రహకు ఈ సందర్శన మరింత ఊపునిస్తుంది.

డేవిడ్ బెకమ్‌కి ధన్యవాదాలు అంటూ ఏపి విద్యాశాఖ మంత్రి ఎక్స్ లో పోస్ట్

లెజెండరీ ఫుట్‌బాలర్ యునిసెఫ్ సద్భావనా రాయబారి అయిన డేవిడ్ బెకమ్‌ గారికి, వైజాగ్ సమీపంలోని కొత్తవలసలో ఉన్న మా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించినందుకు ధన్యవాదాలు.మీ హృదయపూర్వక సంభాషణలు, ప్రోత్సాహం ఉల్లాసభరితమైన శక్తి మా తరగతి గదులను మా ఆట మైదానాన్ని ప్రకాశింపజేశాయి.బెకమ్ లాగా ఎలా సాధన చెయ్యాలి అనే మెలకువలను నేర్చుకోవడానికి మా విద్యార్థులు ఎంతో ఉత్సాహపడ్డారు. ఈ పాఠాలు వారి జీవితాంతం వారితో ఉంటాయి. పిల్లల కలలు విద్య పట్ల మీ నిబద్ధతను మేము ఎంతగానో అభినందిస్తున్నాము అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.