
బీఈఎంఎల్‌లో 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
తొలిపలుకు, విద్య, ఉద్యోగం:* ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఈఎంఎల్ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. తమ సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్): 88 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్): 18 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెటలర్జీ): 2 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ): 1 పోస్టు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్): 8 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (రాజ్‌భాషా): 2 పోస్టులు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 29 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
అభ్యర్థులను రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులను బట్టి షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థులకు బీఈఎంఎల్ దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాల్లో పోస్టింగ్ ఇస్తుంది. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు బీఈఎంఎల్ అధికారిక వెబ్‌సైట్ https://www.bemlindia.in/లో ఉన్న నోటిఫికేషన్‌ను చదవండి.
