Let's talk: editor@tmv.in
బీఆర్ఎస్ పై మంత్రి సీత‌క్క ఫైర్

బీఆర్ఎస్ పై మంత్రి సీత‌క్క ఫైర్

Gaddamidi Naveen
23 సెప్టెంబర్, 2025

రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్థిరత కోసం స్థాపించబడ్డ మహిళా పోదుపు సంఘాలు వారికి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తున్నప్పటికీ, బీఆర్‌ఎస్ పార్టీ మ‌హిళాల‌పై తీవ్ర విమర్శలు చేయ‌డం పై మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్న మహిళలను ఓటు బ్యాంక్‌ మాదిరిగా చూస్తూ, అవమానించే విధంగా మాటలు మాట్లాడటంపై మహిళా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా పోదుపు సంఘాలకు దాదాపు ₹27,000 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఇవి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో, కుటుంబ ఆర్థిక అవసరాల తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇందిరా శక్తి, స్ట్రీ శక్తి వంటి పథకాల కింద మహిళలు వడ్డీ రహిత రుణాలు తీసుకుని స్వయం ఉపాధిలో భాగం అయారని తెలిపారు. ఇవి సాధారణ రుణాలు కాదు ,95 శాతం రుణాలపై తిరిగి చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయని. ఇది మహిళల ఆర్థిక నిబద్ధతకు, ప్రామాణికతకు నిదర్శనం. రాష్ట్రంలో వేలాది మహిళా సంఘాలు తమ ఆర్థిక వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహిస్తూ కుటుంబాలకు ఆర్థిక బలన్ని అందిస్తున్నాయని తెలిపారు. ఇవి ప్రభుత్వానికి భరోసా కావాలి కానీ, ఓటు కోరే విధంగా, అవమానించే వేదికలుగా మారకూడదన్నారు. అలాగే రాష్ట్రంలో మ‌హిళ‌లు మహారాణులుగా ఉండాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు.

గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవార‌ని, మగవారి ఆదాయంపైనే ఆధారపడేవారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. మ‌హిళాలు,పోదుపు సంఘాల ద్వారా వ్యాపార‌లు చేస్తున్నారు. మహిళలు అనుకున్నది సాధించే శక్తిమంతులుగా అవుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటు,” అని మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ నాయకులను నేరుగా ప్రశ్నించారు “మీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లెల్లను కూడా ఇలా అవమానిస్తారా? అని సీత‌క్క ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ పై మంత్రి సీత‌క్క ఫైర్ - Tholi Paluku