
బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసను ఖండించిన యూకే
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింస, అణచివేత, ఆస్తుల ధ్వంసం, అక్రమ అరెస్టులపై యునైటెడ్ కింగ్డమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యూకే ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో మానవ హక్కుల పరిరక్షణపై చర్చలు కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన, బ్రిటన్ పార్లమెంటులో ఆల్ పార్టీ మీటింగ్ సమావేశం అనంతరం వెలువడింది. సమావేశంలో ఇన్ సైట్ యూకే సంస్థ సమర్పించిన నివేదికలో, బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న అణచివేత గురించి వివరించారు.నివేదిక ప్రకారం అక్కడ దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారని, హిందూ ఇళ్లను తగలబెడుతున్నారని, కొన్నిసార్లు కుటుంబాలతో సహా ఇళ్లను దహనం చేస్తున్నట్లు పేర్కొంది. సైన్యం హిందూ కాలనీలపై దాడులు జరిపి అక్రమ అరెస్టులు చేపడుతోందని కూడా వివరించింది.ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఉత్సవాలకు విరుద్ధంగా బంగ్లాదేశ్‌లో హిందువులు దీపావళి, కొత్త సంవత్సర వేడుకలను చేసుకోకూడదని నిర్ణయించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు అణచివేతకు గురవుతున్నారు. వారి దేవాలయాలు, ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. నిరపరాధులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ప్ర భుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు.
యూకే ఎంపీ ప్రతిస్పందిస్తూ
మైనారిటీలపై జరిగే హింస, ద్వేషాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో మానవ హక్కుల పరిరక్షణకు, శాంతియుత ప్రజాస్వామ్య మార్పుకు మేం కట్టుబడి ఉన్నామని బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ అన్నారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి:భారత ప్రభుత్వం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ హింసను ఖండిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. 2025 ఏప్రిల్‌లో హిందూ నాయకుడు భబేష్ చంద్ర రాయ్ హత్య అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస పెరిగిందని, ఇది వ్యవస్థాపిత అణచివేతలో భాగమని పేర్కొన్నాయి. భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం నిరాకరణ
తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ ఈ ఆరోపణలను అసత్యం, అబద్దపు ప్రచారంగా కొట్టిపారేశారు. అయితే బంగ్లాదేశ్, హిందూ బుద్ధిస్ట్, క్రిస్టియన్ ఐక్యత కౌన్సిల్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు ఈ వివరణను నిరాకరించి, ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని విమర్శించాయి.
హింసను ఖండించాలి
నిపుణులు ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతున్న అణచివేతలో భాగంగా పేర్కొన్నారు. చైనాలోని ఉయ్‌ఘూర్ ముస్లింలు, మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలు వంటి మైనారిటీలు కూడా ఇలాంటి హింసను ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. అంతర్జాతీయ సమాజం మతం, జాతి, దేశం అనే తేడా లేకుండా హింసను ఖండించి, మానవ హక్కులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
