Let's talk: editor@tmv.in
ఫెడరల్ బ్యాంక్ 'ట్వైస్ ఈజ్ వైజ్' ప్రచారం: 9 కోట్ల మంది భారతీయులకు అవగాహన

ఫెడరల్ బ్యాంక్ 'ట్వైస్ ఈజ్ వైజ్' ప్రచారం: 9 కోట్ల మంది భారతీయులకు అవగాహన

Dantu Vijaya Lakshmi Prasanna
1 ఫిబ్రవరి, 2026

ఫెడరల్ బ్యాంక్ తన సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన భారీ సైబర్ సెక్యూరిటీ అవగాహన ఉద్యమం 'ట్వైస్ ఈజ్ వైజ్' విజయవంతంగా ముగిసింది. 2025 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ ఆరు నెలల ప్రచారం, 2026 గణతంత్ర దినోత్సవానికి ముందు న్యూఢిల్లీలో ముగింపు వేడుకను జరుపుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సహకారంతో ఈ ప్రచారం నిర్వహించబడింది. ఫ్రాడ్‌స్టర్ల నుండి స్వేచ్ఛ' అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం సాగింది.

'ట్వైస్ ఈజ్ వైజ్' ప్రచారం ఎందుకు ?

ఈ ప్రచారం కేవలం కొన్ని రోజులు మాత్రమే కాకుండా, దాదాపు ఆరు నెలల పాటు కొనసాగిన ఒక సుదీర్ఘ ఉద్యమం. 2025 ఆగస్టు 15 (స్వాతంత్ర దినోత్సవం) నాడు ముంబైలో ప్రారంభమై, 2026 జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) కి ముందు న్యూఢిల్లీలో ముగిసింది. ఇది 11 రాష్ట్రాల్లోని 17 ప్రధాన నగరాలను కవర్ చేస్తూ దేశవ్యాప్తంగా ఒక చైతన్యాన్ని తీసుకువచ్చింది.

'ట్వైస్ ఈజ్ వైజ్' (రెండుసార్లు ఆలోచించడం) వెనుక ఉన్న ఉద్దేశ్యం

డిజిటల్ ప్రపంచంలో మోసగాళ్లు చాలా వేగంగా స్పందించమని ఒత్తిడి తెస్తారు (ఉదాహరణకు: "వెంటనే మీ కెవైసి అప్‌డేట్ చేయండి లేదంటే అకౌంట్ బ్లాక్ అవుతుంది"). అటువంటి సందర్భాల్లో తడబడకుండా, ఎటువంటి లింక్‌పై క్లిక్ చేసే ముందైనా లేదా ఓటీపి చెప్పే ముందైనా రెండుసార్లు ఆలోచించాలి అనేదే ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఈ సంధర్భంగా,బిన్సీ చెరియన్, (SVP & చీఫ్ ఆఫ్ ఇంటర్నల్ విజిలెన్స్, ఫెడరల్ బ్యాంక్) మాట్లాడుతూ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ, సైబర్ మోసాల పట్ల ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. 'ట్వైస్ ఈజ్ వైజ్' అంటే ఏదైనా చేసే ముందు రెండుసార్లు ఆలోచించడం వివేకవంతమైన పని." అని అన్నారు.

నిశాంత్ కుమార్ , డైరెక్టర్, I4C. మాట్లాడుతూ,"సైబర్, ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా పోరాడటంలో ఫెడరల్ బ్యాంక్ ఇతర బ్యాంకులకు ఆదర్శంగా నిలిచింది." అని అన్నారు.

ఈ ప్రచారం కేవలం సాధారణ పౌరులకే కాకుండా, భవిష్యత్ తరానికి అవగాహన కల్పించేలా 85 పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించింది. విద్యార్థులు తమ ఇళ్లలో ఉన్న పెద్దలకు కూడా ఈ విషయాలను వివరిస్తారనే ఆలోచనతో విద్యాసంస్థలపై దృష్టి సారించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ మార్గాలను ఎంచుకున్నారు.

నేరుగా ప్రజలతో మమేకమవ్వడానికి రోడ్‌షోలు, స్థానిక భాషల్లో ప్రజలకు చేరువ కావడానికి రేడియో సిటీతో భాగస్వామ్యం, సోషల్ మీడియా వేదికల ద్వారా యువతకు సైబర్ భద్రత పాఠాలు చెప్పడానికి , డిజిటల్ మీడియా సహకారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పత్రికా ప్రకటనల ద్వారా అవగాహన. కోసం ప్రింట్ మీడియా ఉపయోగించారు.

ప్రభుత్వంతో సమన్వయం (I4C భాగస్వామ్యం)

ఈ ప్రచారం యొక్క అతిపెద్ద బలం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) తో జతకట్టడం. దీనివల్ల బ్యాంకింగ్ నైపుణ్యం ప్రభుత్వ అధికారిక రక్షణ వ్యవస్థలు కలిసి పనిచేసి, సైబర్ నేరాలను ఎలా నివేదించాలో (ముఖ్యంగా 1930 హెల్ప్‌లైన్ నంబర్ గురించి) ప్రజలకు స్పష్టంగా వివరించారు.

ఫెడరల్ బ్యాంక్ 'ట్వైస్ ఈజ్ వైజ్' ప్రచారం: 9 కోట్ల మంది భారతీయులకు అవగాహన - Tholi Paluku