
ఫాం హౌస్‌లో మైనర్లతో రేవ్ పార్టీ
దమ్మరే ధమ్.. దమ్మరే ధమ్.. డ్రగ్స్ రాకపోతే ఈ రాత్రి ధమ్‌లా లేదు! ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేసి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించిన యువకుడు 22 మంది మైనర్లతో సహా 65 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఇదే సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో 401 కేజీల గంజాయిని కొబ్బరికాయల్లో దాచి తరలిస్తున్న ముగ్గురు రాజస్థాన్‌కు చెందినవారిని అరెస్ట్ చేశారు. తెలంగాణ రాజధానిలో డ్రగ్స్ మితిమీరిపోతోంది. శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు విషపు కేంద్రాలుగా మారాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల హస్తం కూడా ఉంటోంది. వరుసగా పార్టీలు జరుగుతున్నా పోలీసుల దృష్టికి మాత్రం కొన్నే మాత్రమే వస్తున్నాయి. వీరిలో కొంతమందే పట్టుబడుతున్నారు. మరికొన్ని పార్టీలు రహస్యంగా జరుగుతున్నాయి.
మత్తులో యువత
హైదరాబాద్ శివారులోని పెద్దమంగలరం గ్రామంలోని 'ఓక్స్ ఫామ్‌హౌస్'లో అర్థరాత్రి జరిగిన అక్రమ పార్టీపై రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు దాడి చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసిన ఈ 'ట్రాప్ హౌస్ పార్టీ'కి టికెట్ రేటు 500 నుంచి 2వేల రూపాయల వరకు వసూలు చేశారు. డీజే, విదేశీ లిక్కర్, మత్తులో జోగుతున్నారు. పోలీసులు చేరేసరికి 65 మంది (22 మైనర్లు, 40 మంది పెద్దలు )పట్టుబడ్డారు. వీరిలో 5గురు మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. మూత్ర పరీక్షల్లో ఇద్దరు యువకులకు గంజాయి మత్తు నిర్ధారణ అయింది.
పట్టుబడ్డ చిన్నారులు
పార్టీ నిర్వాహకుడు 18 ఏళ్ల కాలేజీ విద్యార్థి. అతను తన స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించాడు. అతడు తల్లిదండ్రుల పలుకుబడిని ఉపయోగించుకుని ఫామ్‌హౌస్‌ను బుక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. విదేశీయులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని, ఇది అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు సూచన అని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజే సామాగ్రి, విదేశీ లిక్కర్, మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. మైనర్ల కోసం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పార్టీ నిర్వాహకులు, ఇద్దరు మత్తు పాజిటివ్ యువకులపై చర్యలు తీసుకున్నారు. తమ బృందాలు రైడ్ చేసి 22 మైనర్లను, 40 మంది పెద్దలను పట్టుకున్నట్లు మోయినాబాద్ ఇన్ స్పెక్టర్ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కొబ్బరికాయల్లో గంజాయి
ఇదే సమయంలో రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు, ఖమ్మం వింగ్‌కు చెందిన ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) బృందం సంయుక్తంగా పెద్ద అంబర్‌పేట్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో డీసీఎం వాహనంపై దాడి చేశాయి. విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్న 401 కేజీల గంజాయిని కొబ్బరికాయల లోడులో దాచి తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్ ట్రాన్స్‌పోర్టర్లు అరెస్ట్ అయ్యారు. మరో ముగ్గురు శ్రీధర్, అశు, పరమేశ్వర్ పరారీలో ఉన్నారు.ఈ గంజాయి రాజస్థాన్‌లోని చిత్తూర్‌గఢ్‌కు చెందిన ఓం బిష్ణోయ్‌కు సరఫరా చేయడానికి తీసుకెళ్తున్నారు. బిష్నోయ్ శ్రీధర్‌ను రాజమండ్రిలో సంప్రదించి చోటు నారాయణను వాహనంతో రవాణా చేయించి ట్రిప్‌కు 25 వేల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడైంది. ఈగల్ బృందం గంజాయి తరలిస్తున్న వాహనాన్ని, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది.
మితిమీరిన మత్తు
తెలంగాణ రాజధాని డ్రగ్స్‌కు కేంద్రంగా మారింది. శివారు ఫామ్‌హౌస్‌లు, పబ్‌లు, ప్రైవేట్ పార్టీలు విషపు కేంద్రాలుగా మారాయి. ఇటీవలి ఘటనలు ఈ ట్రెండ్‌ను బహిర్గతం చేస్తున్నాయి.
ఆగస్టు 2025లో ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీలో 6 గురు టెక్కీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరికి కూడా డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. అదే నెలలో మరో చోట లేట్‌నైట్ రైడ్‌లో డిప్యూటీ తహసీల్దార్, బెంగళూరు సప్లయర్‌ను పట్టుకున్నారు. దీంతో హై-ఎండ్ పార్టీ డ్రగ్స్ నెట్‌వర్క్ బయటపడింది. మే 2024లో బెంగళూరు రేవ్ పార్టీ దాడి తెలుగు సినీ ప్రముఖుల సందేహాలకు దారి తీసింది.
సినీ తారల ప్రమేయం?
ఇటీవల అనేక సినీ నటులు, డైరెక్టర్లు ఈ డ్రగ్స్ కేసుల్లో విచారణకు హాజరయ్యారు. ఫామ్‌హౌస్ పార్టీలకు రాజకీయ నాయకుల స్పాన్సర్‌షిప్ ఉంటుందని సమాచారం. యువతలో 15-25 ఏళ్ల వారే డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. పోలీసులు ఈగల్, సైబరాబాద్ బృందాలతో కలిసి డ్రైవ్ నడుపుతున్నా రహస్య నెట్‌వర్క్‌లు బలపడుతున్నాయి. యువతకు అవగాహన కార్యక్రమాలు జరగాలి. లేకపోతే ఈ 'దమ్మరే ధమ్' రాజధాని భవిష్యత్తును మింగేస్తుంది!
