Let's talk: editor@tmv.in
ఫారెస్ట్ అనుమతులు ఇప్పించండి.

ఫారెస్ట్ అనుమతులు ఇప్పించండి.

FL - YUGDR
18 సెప్టెంబర్, 2025

రహదారి కోసం గిరిజనులు వినూత్నంగా జర దీక్షకు దిగారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పిన్న కోట పంచాయతీ సోలుబోగు గ్రామంలో 13 పిల్లలు. బోటుపై డిస్క్ ప్రయాణంతో తామరబ్బ( దేవరపల్లి మండలం ) ఎంపీపీ స్కూల్లోచదువు కోసం వెళుతున్నారు. ఈ వార్త ను మీడియాలో జూన్ తేదీ23 నుండి27వ తేదీన ప్రచురించడంతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎస్టీ కమిషన్ చైర్మన్ ,అల్లూరు జిల్లా కలెక్టర్ లకు స్కూలు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.

కలెక్టర్ స్పందిస్తూ ట్రైనింగ్ కలెక్టర్ఇంజనీరింగ్, జిల్లా విద్యాశాఖ అధికారులు స్వయాన సో లుబొగు గ్రామాన్ని సందర్శించి వీరభద్ర పేట (దేవరపల్లి మండలం ) నుండి సోలు బొంగు నుండి కొత్త బురగ గ్రామం వరకు ఆరు కిలోమీటర్లు 3 కోట్ల 60 లక్షల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్ రోడ్డు నిధులు మంజూరు చేశారు. రోడ్డు పనులు మొదలుపెట్టారు. జూలై నెలలో ఫారెస్ట్ అధికారులు పరిమిషన్ లేదని రోడ్డు పనులు నిలుపుదల చేశారు.

సొల్లు బొంగు, కొత్త బురగా గ్రామాల్లో 50 కుటుంబాలు 180 మంది జనాభా జీవనం సాగిస్తున్నారు. మండల కేంద్రానికి. వైజాగ్ కోసం అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలానికి వెళ్లాలి. అక్కడ బోటు ఎక్కి రిస్కు ప్రయాణం చేయవలసిందే . ప్రభుత్వం వారు రెండు వారాల్లో స్కూలు. రోడ్డు పనులు మొదలుపెట్టారు. ఫారెస్ట్ అనుమతులు లేకపోవడంతో రోడ్డు పనులు మద్యాంతరంగా నిలిచిపోయాయి. నేటికీ నాలుగు నెలలు గడుస్తున్న ఫారెస్ట్ అనుమతులు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నాము.

తక్షణమే ఫారెస్ట్ అనుమతుల కోసం ప్రత్యేక డిఎల్సి ఏర్పాటు చేసి ఫారెస్ట్ నిమతులు మంజూరు చేయాలని రెండు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గెమ్మెల దేముడు, సుకురు రామస్వామి, కాకర గంగరాజు ,చింత భీమరాజు, తామర్ల కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తక్షణమే ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేయాలని, జిల్లా కలెక్టర్ ప్రాజెక్టు అధికారి స్వయంగా వచ్చి పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు.

ఫారెస్ట్ అనుమతులు ఇప్పించండి. - Tholi Paluku