
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ: కవిత ఆగ్రహం
తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని, మతవిద్వేషాలను రెచ్చగొడుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కవిత మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 'తెలంగాణ విలీన దినోత్సవం'గా గుర్తించాలే తప్ప 'విమోచన దినోత్సవం'గా బీజేపీ పిలుపునివ్వడాన్ని ఖండించారు.
భారత ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని, వారి మాటలు, కార్యక్రమాలు దేశాన్ని మతపరంగా చీల్చేందుకు ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. అలాగే తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రేమ లేకపోతే విమర్శించడం అనుచితమని ప్రచారం చేయడం బీజేపీ తత్వమేనని, ఇది ప్రజలను మోసగించేందుకు చర్యగా పేర్కొన్నారు. కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాయాలని సూచించారు. ఇతర రాష్ట్రాలో విమోచన దినోత్సవాలు బిజెపి వాళ్లు చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టడానికి బిజెపి వాళ్లు విమోచన దినోత్సవం జరుపుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఈ చరిత్రను కాపాడుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
