Let's talk: editor@tmv.in
ఫీజు రీయింబర్స్మెంట్ కేంద్రమే చెల్లిస్తోంది

ఫీజు రీయింబర్స్మెంట్ కేంద్రమే చెల్లిస్తోంది

T Venkata Ramana
16 సెప్టెంబర్, 2025

కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీ విద్యార్థులకు వందశాతం రీయింబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చి పాత విధానంలోనూ రీయింబర్స్మెంట్ చేయలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలలకు గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తోందని అన్నారు. హుజూరాబాద్లోని ఓ గార్డెన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రూ.9 వేల కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్లు చెప్పారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వల్ల చాలా నష్టం జరుగుతోందని ఆరోపించారు.

ప్రభుత్వాలు మారినప్పుడు పాత బకాయిలు కూడా చెల్లించాల్సిందేనని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని చూడలేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి కావాల్సిన యూరియాను ఒక సంవత్సరం ముందు నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టకుండా ఎరువులు వచ్చే మార్గంపై దృష్టి పెట్టాలని ఈటల సూచించారు. తాను ఇన్నేళ్లుగా ప్రభుత్వంలో ఉండి అనేక బాధ్యతలు చూశానని కానీ ఇంత బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వాన్ని మాత్రం తొలిసారి చూస్తున్నానని విమర్శించారు. ఇది మంచిది కాదన్నారు.యూరియా కొరత విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్లక్ష్యం అని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్మెంట్ కేంద్రమే చెల్లిస్తోంది - Tholi Paluku