Let's talk: editor@tmv.in
‘పీ4’ సంధానకర్తలుగా పనిచేయాలి: అనకాపల్లి కలెక్టర్

‘పీ4’ సంధానకర్తలుగా పనిచేయాలి: అనకాపల్లి కలెక్టర్

FL - YUGDR
21 సెప్టెంబర్, 2025

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలకు, మార్గదర్శులకు సంధానకర్తలుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. స్థానిక ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో పేదరికం లేని సమాజం పీ4 కార్యక్రమంపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలకు, మార్గదర్శులకు సంధానకర్తలుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా పీ4 కార్యక్రమానికి అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించి, వారిని మార్గదర్శులతో మ్యాపింగ్ చేయాలని తెలిపారు.

ముందుగా మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, బంగారు కుటుంబాలకు కావలసిన అవసరాలు గుర్తించి వాటిని తీర్చగల మార్గదర్శులకు వారిని అనుసంధానం చేయాలన్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్చంధమని, మార్గదర్శులుగా ఎవరైనా స్వచ్చంధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావచ్చునని తెలియజేశారు. పీ4 కార్యక్రమానికి అర్హత కలిగి మిగిలిపోయిన కుటుంబాలను, కొత్త మార్గదర్శులను నమోదు చేయాలని తెలిపారు.

అర్హత లేని కుటుంబాలను, ఆసక్తిలేని మార్గదర్శులను ఈ కార్యక్రమం నుండి తప్పించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా సానుకూల ప్రభావం వచ్చే విధంగా పనిచేయాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. బంగారు కుటుంబ అవసరాలను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మార్గదర్శులు కలిసి నెరవేర్చే అవకాశం కల్పించబడిందని, ఈ అవకాశాన్ని బంగారు కుటుంబాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి జి. రామారావు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

‘పీ4’ సంధానకర్తలుగా పనిచేయాలి: అనకాపల్లి కలెక్టర్ - Tholi Paluku