
ప్రాణం తీసిన ఆస్తి తగాదా
ఇటీవలి కాలంలో కుటుంబ విభేదాలు, వివాహేతర సంబంధాలు కారణంగా భార్య భర్తను, భర్త భార్యను హత్య చేసిన సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అలాంటి మరో దారుణం ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒక మహిళ తన భర్తను హత్య చేసి, శవాన్ని పాడుబడ్డ బావిలో పడేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆమెతో కలిసి ఈ నేరంలో పాల్గొన్న మరో ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆరు నెలల క్రితం జరిగిన ఈ హత్య ఇటీవలే బహిర్గతమైంది.
చాన్హో పోలీస్ స్టేషన్ పరిధిలోని బధయ్యా గ్రామానికి చెందిన రాంబాలి యాదవ్ (45) ఆరు నెలల క్రితం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని జాడను తెలుసుకోలేకపోయారు. ఈ క్రమంలో అక్టోబర్ 10న గ్రామ సమీపంలోని ఒక పాడుబడ్డ బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులకు అక్కడ కుళ్లిపోయిన గుర్తుతెలియని ఒక శవం లభ్యమైంది. దీంతో అనుమానస్పద మృతి కేంద్ర కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
ఇక విచారణలో భాగంగా ఘటన స్థలంలో లభ్యమైన మృతదేహం రాంబాలి యాదవ్ అని నిర్ధారణ అయింది. దీంతో యాదవ్ కుటుంబ సభ్యులను సంప్రదించారు అధికారులు. ఇదిలా ఉండగా మృతుడి కుమారుడు రాహుల్ యాదవ్, అప్పట్లో తన తండ్రి కనిపించకుండా పోయాడు అని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తు సమయంలో రాంబాలి రెండో భార్య చంపా దేవి అలియాస్ చంపా ఊరావ్ ప్రవర్తన అనుమానంగా అనిపించడంతో ఆమెను విచారించారు పోలీసులు. కాగా విచారణలో ఆమె చెప్పిన పొంతనలేని సమాధానాలు ఆమెపై మరింత అనుమానాన్ని రేకేతించాయి.దీంతో చంపా దేవిని గట్టిగా నిలదీయడంతో తనే తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించిది.
పోలీసుల తెలిపిన వివరాల వివరాల ప్రకారం, రాంబాలి యాదవ్ ఆరు నెలల క్రితం తన భూమిని అమ్మి వచ్చిన డబ్బును కుటుంబ సభ్యులకు పంపించాడు. ఇది నచ్చని చంపా దేవి డబ్బు విషయంలో యాదవతో తరచూ గొడవపడేది.ఈ క్రమంలో చివరికి ఆమె కోపంతో భర్తను చంపాలని నిర్ణయించింది.
దింతో చంపా దేవి తన బంధువు విష్ణు ఊరావ్తో పాటు మరో ఇద్దరిని కలుపుకొని రాంబాలిని హత్య చేసింది. అనంతరం ఆయన మృతదేహాన్ని గ్రామ సమీపంలోని పాడుబడ్డ బావిలో పడేశారు. బావి ఎప్పటినుంచో వాడకంలో లేకపోవడంతో ఆ రహస్యం ఇంతకాలం బయటపడలేదు అని పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి దేశీయ తుపాకి, మూడు 7.65 మిల్లీమీటర్ బుల్లెట్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు రూరల్ ఎస్పీ ప్రవీణ్ పుష్కర్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా కుటుంబ వివాదం వల్ల జరిగిన ఘోరం. నిందితులను పట్టుకున్నాం. బాధిత కుటుంబానికి తగిన న్యాయం న్యాయం చేకూరుస్తానని ఆయన స్పష్టం చేశారు.
