Let's talk: editor@tmv.in
ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ గల వ్యక్తికి ఓటు వేయండి: ఎమ్మెల్యే కేవీఆర్

ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ గల వ్యక్తికి ఓటు వేయండి: ఎమ్మెల్యే కేవీఆర్

Gaddamidi Naveen
7 డిసెంబర్, 2025

తెలంగాణ‌ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లు ఒక్కసారి ఆలోచించి, ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..అంద‌రు స‌ర్పంచ్ ఎన్నిక‌లు అంటే కామ‌న్ గా తిసుకుంటారు, ఎమ్మెల్యే, ఎంపీలు అంటే గొప్ప విష‌యము,పెద్ద ఎన్నిక‌లు అనుకుంటారు. కానీ నా దృష్టిలో స‌ర్పంచ్ ఎన్నిక‌లు ముఖ్యం అన్నారు. గ్రామీణ స్థాయిలో మ‌రుపురావాలి అంటే స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్లు ముఖ్యం ఎందుకంటే ఎంత పెద్ద ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్య‌మంత్రి అయినా గ్రామ పంచాయ‌తీకి రావాలంటే గ్రామ పంచాయ‌తీ మిట్టింగ్ లో అధ్య‌క్షుడిగా ఉండేది ఆ స‌ర్పంచ్ ప‌ద‌వే..అది స‌ర్పంచ్ కు ఉండే గొప్ప‌తనమ‌ని ఆయ‌న అన్నారు.

డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నీతినిజాయితీ గల వ్యక్తికి మాత్రమే ఓటు వేయాలని ఆయన కోరారు.మద్యం ముట్టకుండా, గ్రామాభివృద్ధిని నిజంగా కోరుకునే సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని ఆయన ఉద్ఘాటించారు.

అలాగే త‌ను శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో కామారెడ్డి ప్ర‌జ‌లు ఏది ఆశించ‌కుండా గెలిపించారో అదే విధంగా తెలంగాణ ప్ర‌జ‌లు ఇప్పుడు జ‌రుగుతున్న స‌ర్పంచ్, వార్డు ఎన్నిక‌ల్లో నీతినిజాయితీ గల వ్యక్తికి మాత్రమే ఓటు వేయాలని,ఓటు అనేది ప్రజల యొక్క ఆయుధం లాంటిదని, సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారానే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రజలకు గుర్తు చేశారు.

స్థానిక ఎన్నిక‌

తెలంగాణ‌లో మొత్తం మూడు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌రుగుతుంది. తొలిద‌శ‌లో స‌ర్పంచ్ 4,236 వార్డులు 37,440 ల‌కు డిసెంబ‌ర్ 11న ఉద‌యం 7నుంచి 1 గంట‌ల వ‌ర‌కు జ‌రుగనుంది. అనంత‌రం ఓట్లు లెక్కింపు జ‌రుగ‌నుంది.రెండో ద‌శ నామినేష‌న్ స్వీక‌ర‌ణ పూర్తియ్ నిన్న‌టితో ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు సాయంత్రం 5 గంట‌ల‌కు ముగిసింది.మూడో ద‌శ నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌రుగుతుంది.మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.రాష్ట్రంలోని గ్రామీణ గ్రామపంచాయతీ ఓటర్ల సంఖ్య సుమారు 1.67 కోట్లుగా ఉంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ డిసెంబర్ 11, 14,17న జరగనున్నాయి.ఈ ఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు, బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.

ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ గల వ్యక్తికి ఓటు వేయండి: ఎమ్మెల్యే కేవీఆర్ - Tholi Paluku