
ప్రభుత్వ పాఠశాలలపై ఎందుకింత నిర్లక్ష్యం
మంత్రి సీతక్క సోంత నియోజకవర్గమైన ములుగు జిల్లాలో అద్దె చెల్లించలేదని భవన ఓనర్ ఆగ్రహంతో సోషల్ వేల్పేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల గేటుకు తాళం ఘటన జిల్లా కేంద్రంలో జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఏడాదికి పైగా అద్దె చెల్లించకపోవడం వల్ల భవన యజమాని తాళం వేసిన సంఘటన శిక్షణ పొందుతున్న విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.
ఉపాధ్యాయులు, సిబ్బంది ఎండలో నిల్చొని పడిగాపులు కాసిన, విద్యా వ్యవస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మళ్లీ ఒకసారి బయటపడ్డాయని పేర్కొంది. ఇది కేవలం అద్దె చెల్లింపుల విషయంలో మాత్రమే కాకుండా, ప్రభుత్వ బాధ్యతల పరంగా కూడా ఓ పెద్ద వైఫల్యంగా భావించాలని మీఆర్ఎస్ సూచించింది. పేద కుటుంబాలకు చెందిన బాలికలు ఉన్న ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు వారికి భవిష్యత్ ఆశగా నిలవాల్సిన సమయంలో, నిర్వాకం వల్ల అవి అసమర్థంగా మారుతున్నాయని తెలిపారు. ఇసుక మాఫియాలపై ఉండే చొరవ సీతక్కకి, ప్రభుత్వానికి, ఇటువంటి సమస్యలను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించింది. తెలంగాణలో చాలా కాలంగా, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు అద్దె బకాయిల్లో ఉన్నాయి. ఉదాహరణకి, ఒక మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల బకాయిలుగా 13 నెలల అద్దె, సుమారు రూ.6 లక్షలు అనేది బకాయిలుగా ఉన్నట్లు తెలిపారు.
మంత్రి సీతక్క నాయకత్వంలోని ములుగు నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉండడం గమనార్హం. ఒక వైపు "విద్యే శక్తి" అనే నినాదాలు, మరోవైపు విద్యాసంస్థలకు అద్దె కూడా చెల్లించలేని ఆర్థిక పరిస్థితి ఇవి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి, విద్యార్థుల బోధనకు ఆటంకం లేకుండా చేయాలని, భవన యజమానితో చర్చించి అద్దె చెల్లింపులు జరిపి తాళం తీసేలా చర్యలు తీసుకోవాలి. పేద పిల్లల చదువు ఆగకూడదు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పేద పిల్లల భవిష్యత్తే బలహీనమైన పరిస్థితి తలెత్తకూడదు బీఆర్ఎస్ సూచించింది.
