Let's talk: editor@tmv.in
ప్రభుత్వ నిర్లక్ష్యానికి విద్యార్థుల భవిష్యత్తు బలి!

ప్రభుత్వ నిర్లక్ష్యానికి విద్యార్థుల భవిష్యత్తు బలి!

Gaddamidi Naveen
7 అక్టోబర్, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో భాగంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతోన్న విద్యార్థుల ఫీజులు ప్రభుత్వం చెలిస్తుందని చెప్పి. వేలాది మంది విద్యార్థుల ఫీజులు చెల్లించని సర్కారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ స్కీమ్ కింద నయా పైసా విడుదల చేయని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఓటు వేయించిన హామీలు అన్నీ మాయమయ్యాయా? పేదింటి పిల్లల కలలు కల్లోలమవుతున్నాయా? బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పేరుతో ప్రభుత్వమే ప్రవేశపెట్టిన పథకం, పేదింటి బిడ్డలకు విద్యను అందించాలన్న సంకల్పం...ఇప్పుడు అదే ప్రభుత్వం తన వాగ్దానాన్నే మరిచిందా? అని విమర్శించారు.

ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదని విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు వాటిపై ప్రభుత్వ నిర్లక్ష్యం చూపడం ఏమిటి? అన్నారు.నల్గొండ, జగిత్యాల జిల్లా కేంద్రాల్లోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దసరా సెలవులు అయిపోయాక క్లాస్‌కి వచ్చిన పిల్లల్నిక్లాసు రూముల్లోకి అనుమతించకూండా బయటనే ఉంచి. ఫీజులు చెల్లిస్తే కానీ లోపలకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పింది. ప్రభుత్వం తమకు ఫీజులు చెల్లించకపోవడంతో స్కూళ్లను నడుపలేకపోతున్నామని ప్రభుత్వం ఫీజు చెల్లించకుంటే విద్యార్థుల తల్లిదండ్రులే ఆ భారాన్ని మోసుకోవాలని తేల్చిన స్కూల్ యాజమాన్యాలు అన్నారని తెలిపారు.

తమ గోడును చెప్పుకునేందుకు జగిత్యాల కలెక్టరేట్ కువెళ్లినా విద్యార్థుల వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఉపశమనం కనిపించలేదు. ఫీజుల కోసం "డిప్యూటీ సీఎం దగ్గరకు వెళ్ళండి" అనే జవాబుతో పంపించేసిన అధికారులు ఇది ప్రజల పాలన అంటే ఇదేనా? అని కాంగ్రెస్ ప్రభుత్వని కవిత ప్రశ్నించారు. ఇదేనా ప్రతి పేద విద్యార్హుడికి విద్య హక్కు అనే నినాదం? ప్రభుత్వం మేల్కొనాలి పిల్లల చదువు రాజకీయాల కూరగాయ కాకూడదు వెంటనే బకాయి ఫీజులు చెల్లించి,విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి విద్యార్థుల భవిష్యత్తు బలి! - Tholi Paluku