Let's talk: editor@tmv.in
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పెండింగ్‌ బకాయిలు రూ.745 కోట్లు విడుదల

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పెండింగ్‌ బకాయిలు రూ.745 కోట్లు విడుదల

Gaddamidi Naveen
28 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు, వివిధ రకాల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం రూ. 745 కోట్లను విడుదల చేసింది.

గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వరుసగా నెరవేరుస్తోంది. ఇందులో భాగంగానే గత జూన్ నెల నుంచి ప్రతి నెలా రూ. 700 కోట్లకు పైగా నిధులను నిరంతరాయంగా విడుదల చేస్తూ బకాయిలను చెల్లిస్తోంది. తాజా విడుదలతో ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగనున్నాయి.

ఉద్యోగుల బిల్లులతో పాటు, గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు ఆర్థిక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ. 389 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమన్వయం చేసుకుంటూనే, అటు ఉద్యోగుల సంక్షేమానికి, ఇటు గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. బకాయిల విడుదలతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.