Let's talk: editor@tmv.in
ప్ర‌భుత్వం మహిళలకు ఇస్తున్న చీరలు ఇందిరమ్మ కట్టిన చీరల్లాగే ఉన్నాయి: మంత్రి జూప‌ల్లి

ప్ర‌భుత్వం మహిళలకు ఇస్తున్న చీరలు ఇందిరమ్మ కట్టిన చీరల్లాగే ఉన్నాయి: మంత్రి జూప‌ల్లి

Gaddamidi Naveen
23 నవంబర్, 2025

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న చీరల పంపిణీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరల పై మంత్రి జూప‌ల్లి కృష్ణా రావు, మహిళలకు అందిస్తున్న చీరలు గతంలో ఇందిరమ్మ కట్టిన చీరల్లాగే నాణ్యతతో తయారుచేయించామని ఆయన పేర్కొన్నారు.నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల్లో సభ్యులు కాని మహిళలకు కూడా చీరలు అందే విధంగా సమగ్ర పంపిణీ వ్యవస్థను అమలు చేస్తున్నట్టు తెలిపారు.

కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుతూ, గతంలో అక్కడ రోడ్ల పరిస్థితిని చంద్రబాబు నాయుడు విమర్శించారని గుర్తుచేశారు.నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కిరణ్‌కుమార్ రెడ్డిని ఒత్తిడి చేసి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించాను అని మంత్రి గుర్తుచేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని మంత్రి తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో మితిమీరిన అప్పులు చేయడంతో ప్రస్తుతం రాష్ట్ర ఖజానాపై భారీ వడ్డీ భారం పడుతోందని అన్నారు. సంక్షేమ పథకాల అమలుకు అయ్యే ఖర్చు కంటే కేసీఆర్ చేసిన అప్పులపై చెల్లిస్తున్న వడ్డీ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.కేసీఆర్ చేసిన అప్పుల వల్లే ప్రస్తుతం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కొంత జాప్యం జరుగుతోందని అంగీకరించారు. ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి వచ్చిన మొత్తం అప్పుల కంటే పదింతలు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితికి నెట్టేశారని మంత్రి ఆరోపించారు.

ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని మంత్రి సూచించారు. ఇచ్చిన హామీల కూడా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్థిక పరిస్థితులను సమతుల్యం చేస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివరించారు.

ప్ర‌భుత్వం మహిళలకు ఇస్తున్న చీరలు ఇందిరమ్మ కట్టిన చీరల్లాగే ఉన్నాయి: మంత్రి జూప‌ల్లి - Tholi Paluku