Let's talk: editor@tmv.in
ప్రపంచ విజేతల కన్నీళ్లు తుడిచిన పవన్ కళ్యాణ్

ప్రపంచ విజేతల కన్నీళ్లు తుడిచిన పవన్ కళ్యాణ్

Panthagani Anusha
15 డిసెంబర్, 2025

అంధుల క్రికెట్ ప్రపంచకప్‌లో దేశానికి విజయాన్ని అందించిన తెలుగు మహిళా జట్టు సభ్యుల దయనీయ పరిస్థితి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసును కదిలించింది. వారి కష్టాలు విన్న వెంటనే స్పందించిన ఆయన కేవలం 24 గంటల వ్యవధిలో వారి కుటుంబాలకు అవసరమైన గృహోపకరణాలు, నిత్యావసరాలు పంపి భరోసా కల్పించారు.

సాధారణంగా ఎవరు సమస్య చెప్పుకున్నా ఆలస్యం చేయకుండా స్పందించే పవన్ కళ్యాణ్ అంధ క్రికెటర్లతో భేటీ అయిన సందర్భంగా వారి కుటుంబాల దైన్య స్థితిని తెలుసుకుని చలించిపోయారు. కష్టపడి ప్రపంచకప్‌ గెలిచినా మ్యాచ్ ఫీజుతోనే కుటుంబ సభ్యుల ఆకలి తీర్చాల్సిన పరిస్థితి ఉందని కెప్టెన్ దీపిక చెప్పిన మాటలు ఆయనను కదిలించాయి.

క్రికెటర్ల ఇళ్లకు వస్తు సామాగ్రి

శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాకు చెందిన కెప్టెన్ దీపిక, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడికి చెందిన పాంగి కరుణ కుమారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

ఆయన ఆదేశాల మేరకు జనసేన నాయకులు, యంత్రాంగం ఆయా గ్రామాలకు హుటాహుటిన చేరుకున్నారు. ఇరు కుటుంబాలకు టీవీ, టేబుల్ ఫ్యాన్లు , మిక్సర్ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్లు, పాత్రలు, నూతన వస్త్రాలు, దుప్పట్లు, నిత్యావసర సరకులు సహా అనేక గృహోపకరణాలు, వస్తు సామాగ్రిని అందజేశారు. దీంతో క్రీడాకారుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది.

అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఛైర్మన్ టి.సి. వరుణ్ ఆధ్వర్యంలో జనసేన నేతలు వస్తువులను అందించగా... కరుణ కుమారి కుటుంబానికి... రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనుమతులిచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంత వేగంగా రోడ్లు మంజూరు కావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

నూతన గృహాల నిర్మాణంపై దృష్టి

ఈ ఇద్దరు తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతన గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత వారికి అవసరమైన డైనింగ్ టేబుళ్లు, మంచాలు లాంటి ఇతర గృహోపకరణాలను సైతం సమకూర్చాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇప్పటికే క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని విన్నవించగా ఆమె కోరిన వెంటనే ఆ రోడ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయించారు.

ప్రపంచ విజేతల కన్నీళ్లు తుడిచిన పవన్ కళ్యాణ్ - Tholi Paluku