Let's talk: editor@tmv.in
ప్రపంచ జూనియర్ వుషూ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాల పంట
ప్రపంచ జూనియర్ వుషూ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాల పంట

ప్రపంచ జూనియర్ వుషూ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాల పంట

Shaik Mohammad Shaffee
31 మార్చి, 2026

అంతర్జాతీయ వుషూ వేదికపై భారత జూనియర్ క్రీడాకారులు రికార్డుల వేట సాగించారు. చైనాలో జరిగిన 10వ ప్రపంచ జూనియర్ వుషూ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ ఇండియా చారిత్రాత్మక ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్ మొత్తం 9 పతకాలను కొల్లగొట్టింది. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉండటం విశేషం. భారత అథ్లెట్లు తమ అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, క్రీడా స్ఫూర్తితో ప్రత్యర్థులను చిత్తు చేసి పతక పీఠాన్ని అధిరోహించారు.

సండా ఈవెంట్లలో స్వర్ణాల పంట

భారత ఆటగాళ్లు ముఖ్యంగా 'సండా' (ఫైటింగ్) విభాగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బాయ్స్ 45 కేజీల విభాగంలో థోంగమ్ ఉపేంద్రో, జూనియర్ బాయ్స్ 52 కేజీల విభాగంలో నోంగ్మైతమ్ పమ్హీబా, యూత్ బాయ్స్ 52 కేజీల విభాగంలో లోయిటోంగ్‌బామ్ విక్టర్ అద్భుత పోరాటపటిమను కనబరిచి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. వీరి మెరుపు దాడులకు ప్రత్యర్థులు తలవంచక తప్పలేదు.

ఇతర విభాగాల్లోనూ భారత్ సత్తా

కేవలం స్వర్ణాలే కాకుండా ఇతర విభాగాల్లోనూ భారత్ సత్తా చాటింది. యూత్ 48 కేజీల విభాగంలో యువరాజ్ రజత పతకాన్ని గెలుచుకోగా.. జూనియర్ 48 కేజీల విభాగంలో గౌతమ్ మంకాస్, యూత్ 48 కేజీల విభాగంలో అను కాంస్య పతకాలను సాధించారు. ఇక కళాత్మక విభాగమైన ' తావోలు ' ఈవెంట్లలో కూడా భారత అమ్మాయిలు రాణించారు. చాంగువాన్ గర్ల్స్ విభాగంలో రాజకుమారి లాంచెన్బి చాను కాంస్య పతకాన్ని గెలుచుకోగా, కొంతోజం దేవికారాణి దేవి ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు.

ప్రపంచ జూనియర్ వుషూ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాల పంట - Tholi Paluku