
ప్రపంచ అటవీ పరిమాణంలో భారత్‌కి 9 ర్యాంక్
ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది. గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్‌మెంట్ (జీఎఫ్ఆర్ఏ)–2025 ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అటవీ ప్రాంత పరిమాణంలో భారత్ 9వ స్థానానికి ఎదిగింది. ఈ నివేదికను ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ఇండోనేషియాలోని బాలి నగరంలో విడుదల చేసింది. గతంలో భారత్ 10వ స్థానంలో ఉండగా ఈసారి తొమ్మిది స్థానంలో నిలిచి ఓ మెట్టు పైకెక్కింది. అదే సయమంలో అటవీ విస్తీర్ణం పెరుగుదలలో భారత్ తన 3వ స్థానంలోనే కొనసాగుతుంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ లో వెల్లడించారు. కేంద్రమంత్రి ఈ విధంగా తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అమలవుతున్న కార్యక్రమాలైన అడవుల సంరక్షణ, పునరావరణం, ప్రజా భాగస్వామ్యంపై దృష్టి పెట్టడం ఈ విజయానికి కారణమని అన్నారు. అలాగే ప్రధాని పిలుపునిచ్చిన ‘ఒక చెట్టు — తల్లిపేరుతో’ ( ఏక్ పేడ్ మా కే నామ్ ) కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంచిందని మంత్రి వివరించారు. ఈ ప్రజా భాగస్వామ్యం పచ్చదనానికి, భవిష్యత్ తరాల సుస్థిరతకు మార్గం సుగమం చేస్తోందని ఆయన అన్నారు. మొత్తంగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వాల విస్తృత మొక్కలు నాటే కార్యక్రమాలు, వాటి సంరక్షణ చర్యల వల్ల భారత్ ఈ గ్లోబల్ ర్యాంకింగ్‌లో ముందుకు పోవడానికి మద్దతునిచ్చాయి.
ఏక్ పేడ్ మా కే నామ్
ఈ పథకాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ 2024లో ప్రారంభించారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లోని బుద్ధ జయంతి పార్క్‌లో ప్రధాని చెట్టునాటి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. దీంతో దేశంలో 2025 మార్చి నాటికి 140 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజా భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్రం ఈ పథకానికి ఎటువంటి నిధులు కేటాయించనప్పటికీ ఇప్పటికే ఉన్న అడవులు నాశనమైన ప్రదేశాల్లో కొత్త చెట్లు నాటడం (క్యాంపా), మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం లోనూ, గ్రీన్ ఇండియా మిషన్, కేంద్ర, రాష్ర అటవీ పథకాల్లో భాగంగా ఈ చెట్ల పెంపకాన్ని చేపట్టారు. ఏక్ పేడ్ మా కే నామ్ పథకం పై పథకాలకు కొనసాగింపుగా మాత్రమే ఉంది.
2025లో గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్‌మెంట్ (GFRA 2025) ప్రకారం, ప్రపంచంలో అటవీ ప్రాంతం పరంగా మొత్తం 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ అటవీ ప్రాంతం ఉన్న దేశాలు 10. మొత్తం అటవీ ప్రాంతం పరంగా ప్రపంచంలోని అగ్ర 8 దేశాలు: వరుసగా 1) రష్యా – 8,149,000 చ.కి.మీ, 2)బ్రెజిల్ 4,920,000 చ.కి.మీ, 4) కెనడా, 5) అమెరికా సంయుక్త రాష్ట్రాలు, 6)చైనా, 7) ఆస్ట్రేలియా, 8) కాంగో (డెమొక్రాటిక్ రిపబ్లిక్), 9) ఇండియా – 1,400,000 చ.కి.మీ విస్తీర్ణంలో అటవీ ప్రాంతం వ్యాపించి ఉంది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా దేశాలు ప్రాంతాలు, భూభాగాలు అటవీ ప్రాంతం పరంగా తమ గణాంకాలు సమర్పించాయి.
