Let's talk: editor@tmv.in
ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

Gaddamidi Naveen
21 జులై, 2026

ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా 'భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' జాతికి అంకితం కానుంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి ప్రధాని పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రులు హెలిప్యాడ్, వివిఐపి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భారీ ప్రజా వేదిక పనులను క్షుణ్ణంగా సమీక్షించారు. ప్రధాని పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో, అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం కోసం విజయనగరం జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో పనులను వేగవంతం చేస్తోంది.

ట్యాగ్‌లు
AlluriSitaramaRajuAirportPMModiNarendraModiAndhraPradeshNorthAndhraVizianagaramAirportInauguration
ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు - Tholi Paluku