Let's talk: editor@tmv.in
ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం

ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం

Gaddamidi Naveen
23 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్లమెంట్ హౌస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆగస్ట్ 1న విజయనగరం జిల్లాలో జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధానిని ఆయన అధికారికంగా ఆహ్వానించారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఈ విమానాశ్రయం కీలకమైన 'గ్రోత్ ఇంజన్'గా మారబోతోందని ఆయన పేర్కొన్నారు. ఆగస్ట్ 1న జరిగే ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ భోగాపురం విమానాశ్రయంతో పాటు పలు అనుబంధ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగ ఎయిర్‌పోర్ట్ ప్యాసింజర్ టెర్మినల్, ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, ఎడ్యుసిటీలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలను ఒక చారిత్రాత్మక ఘట్టంగా, అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.