Let's talk: editor@tmv.in
ప్రధాని జీవిత ప్రయాణం తెలిపే ‘మోడీ మిషన్’

ప్రధాని జీవిత ప్రయాణం తెలిపే ‘మోడీ మిషన్’

Pinjari Chand
24 అక్టోబర్, 2025

ప్రముఖ న్యాయవాది, మాజీ జర్నలిస్ట్ బర్జిస్ దేశాయ్ రచించిన ‘మోడీ మిషన్’ అనే పుస్తకాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లోని వడనగర్ నుంచి న్యూఢిల్లీలో ప్రధాని పీఠం అధిష్టించే వరకు వివరించనున్నారు. ప్రధాని బాల్యం, యువకుడిగా ఎదుర్కోన్న అనుభవాలపై ఈ పుస్తకం దృష్టి సారిస్తుంది. ఈ పుస్తకంలో సామాజిక-ఆర్థిక, తత్వశాస్త్రం, పాలనపై ప్రధానికున్న దృక్పథాన్ని వివరిస్తుంది. పారదర్శక పాలనని తెలుపుతూనే భారతదేశ సామూహిక చైతన్యాన్ని మోడీ ఎలా పెంచగలిగారో రచయిత తెలపడానికి ప్రయత్నించారు. పుస్తకం కేవలం జీవన చరిత్ర కాదు అది ఒక ఆలోచన కథగా, మోడీ జాతీయవాదాన్ని రూపొందించిన విధానాన్ని చూపిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక నిర్ణయాలపై ఆయన తీసుకున్న చర్యలను తెలుపుతుంది. భారతదేశాన్ని ప్రభావవంతమైన, సంక్షేమ రాష్ట్రంగా మార్చడానికి తీసుకున్న ప్రయత్నాలను కూడా చూపిస్తుంది.

పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం 21వ శతాబ్దపు అత్యంత గమనించిన నాయకుల్లో ఒకరు ప్రధాని మోడీ. ఈ పుస్తకం దేశం కోసం ఆయన చూపిన అశేషమైన ప్రేమ, శ్రద్ధను చూపిస్తుందన్నారు. ఈ పుస్తకం ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగత, వ్యూహాత్మక ప్రయాణం పై లోతైన అవగాహన కలిగిస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇప్పటివరకు అనేక పుస్తకాలు వెలువడ్డాయి. ఈ పుస్తకాలు ఆయన వ్యక్తిత్వం, రాజకీయ జీవితం, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక విధానాలు, సామాజిక దృక్పథాలను వివరిస్తాయి.

1. ‘ది పారడోక్సికల్ ప్రైమ్ మినిస్టర్’ ఈ పుస్తకంలో శశి థరూర్, మోదీ ప్రభుత్వ విధానాలను, విదేశాంగ విధానాలను, దేశపాలనలోని అనేక అంశాలను విమర్శించారు. ఈ పుస్తకం 2018లో విడుదలైంది.

2. ‘నరేంద్రమోడీ ఏ పొలిటికల్ బయోగ్రఫీ’ అనే పుస్తకాన్ని ఆండీ మారినో రాశారు. ఈ పుస్తకం మోడీ రాజకీయ జీవితం, ఆయన నాయకత్వ లక్షణాలు, భారతదేశ రాజకీయాల్లో ఆయన పాత్రను విశ్లేషిస్తుంది. పుస్తకం 2015లో ప్రచురించారు.

3. మోడీ ఏగైన్ (వై మోడీ ఇజ్ రైట్ ఫర్ ఇండియా) ఈ పుస్తకాన్ని ఆభాస్ మాల్దహియార రచించారు. రచయిత మోడీ ఆర్థిక విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశానికి ఆయన చూపిన దిశను సమీక్షించారు. ఈ పుస్తకం 2019లో విడుదలైంది.

4. ‘మోడీ అండ్ ద వరల్డ్ – రీ కనస్ట్రక్టింగ్ ఇండియన్ ఫారిన్ పాలసీ’ పుస్తకాన్ని సిందర్పాల్ సింగ్ 2017 లో రాశారు.

ఈ పుస్తకం మోదీ విదేశాంగ విధానాలను, ఆయన విదేశీ దేశాలతో సంబంధాలను, భారతదేశ అంతర్జాతీయ పాత్రను విశ్లేషిస్తుంది. పుస్తకాన్ని 2017లో ప్రచురించారు.