Let's talk: editor@tmv.in
ప్రతి బీహారి సీఎం కావచ్చు

ప్రతి బీహారి సీఎం కావచ్చు

Pinjari Chand
7 అక్టోబర్, 2025

వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి బీహారి సీఎం కావచ్చని, అందుకనుగుణంగా రాజకీయాలు నిర్వహిస్తామన్నారు. 2025లో 243 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11న రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఈసారి మహాఘట్భంధన్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కచ్చితంగా ఘట్బందన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తేజస్వీ యాదవ్ సీఎం అయినప్పుడు బీహార్ లో నిరుద్యోగం ఉండదు. అందరికీ ఉద్యోగాలిస్తాం. బీహార్ నుంచి నిరుద్యోగాన్ని పారదోలుతాం. ఇల్లులేని వారుండరు. ఈరోజు ఓ పండుగ ప్రారంభమవుతుందన్నారు. అలాగే వేడుకునే ముఖ్యమంత్రిని బీహార్ ప్రజలు కోరుకోవడం లేదని, గర్జించే ముఖ్యమంత్రినే కోరుకుంటున్నారన్నారు. 20 సంవత్సరాలుగా రాష్​ట్రంలో అవినీతి, నేరాలు, నిరంకుశత్వం పెరిగిపోయాయని నితీశ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు.

ప్రతి బీహారి సీఎం కావచ్చు - Tholi Paluku