
ప్రజా సమస్యలను చర్చించడానికే ఎంపీలను ఎన్నుకున్నారు: తెలంగాణ బీజేపీ చీఫ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సోమవారం విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు కార్యకలాపాలను పదేపదే అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశ ప్రజలు ఎంపీలను ప్రజా సమస్యలపై చర్చించడానికి ఎన్నుకున్నారు కానీ పార్లమెంట్‌ను అడ్డుకోవడానికి కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ సర్ పై రాంచందర్ రావు స్పందిస్తూ..పార్లమెంట్‌లో చర్చకు బదులు విపక్షం ప్రత్యేక తీవ్ర సవరణ (సర్) ప్రక్రియను ఒక సమస్యగా లేవనెత్తుతోందని రాంచందర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న నకిలీ ఓట్లను తొలగించడానికి సర్ అవసరమని తెలంగాణ ఎంపీలు కూడా అభిప్రాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. సర్ అనేది రాజకీయ అంశం కాదని, ఇది చాలా సంవత్సరాలుగా సవరించబడని ఓటర్ల జాబితా యొక్క ఇంటెన్సివ్ రివిజన్ అని ఆయన వివరించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినందున, సర్ ను "ఓటు చోరీ"తో ముడిపెట్టి అంశంగా మారుస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు అనవసరమైన, ఓటు చోరీ అని భావోద్వేగంగా అనుసంధానిస్తూ సభలకు ఆటంకం కలిగిస్తోందని. ఇది పూర్తిగా రాజకీయ నాటకం అని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, విజయ్ కుమార్ వసంత దేశంలో జరుగుతున్నసర్ ప్రక్రియపై తక్షణ చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బూత్ లెవల్ ఆఫీసర్‌లపై (BLOs) అధిక ఒత్తిడి కారణంగా మరణాలు అలసట జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. “మేము పార్లమెంటు పనిచేయాలని, చర్చలు జరగాలని కోరుకుంటున్నాము. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న సర్, ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిపోయిన 'ఓటు చోరీ'పై చర్చ జరగాలని కోరుకుంటున్నాము. సర్ జరుగుతున్న 12 రాష్ట్రాలలో BLO లు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అని ఠాగూర్ తెలిపారు.
సర్ రెండో దశ రాష్ట్రాలు
బీహార్ మొదటి దశ విజయవంతంగా పూర్తయిన తర్వాత, సర్ యొక్క రెండవ దశ అండమాన్ & నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఫిబ్రవరి 14, 2026 న తుది ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది.
