
ప్రజారోగ్యమే ప్రథమం: మంత్రి సత్యకుమార్
ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపణీ చేశారు. సోమవారం ధర్మవరంలోని ఎన్డీయే కార్యాలయంలో లబ్ధిదారులకు దాదాపు రూ.67 లక్షలు విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో 102 మంది లబ్ధిదారులకు రూ. 67 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని సత్యకుమార్ అన్నారు.
పేద,మధ్యతరగతి ప్రజలకు వైద్యం భారంగా మారుతున్న తరుణంలో ప్రజల నుంచి వైద్య సహాయం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసిల ద్వార రూ. 5.63 కోట్లు లబ్ధిదారులకు అందించామని, సోమవారం పంపిణీ చేసిన రూ. 67 లక్షలతో కలిపి మొత్తం రూ. 6.31 కోట్లు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని తెలిపారు.
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వాన్ని ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా అడుగు వేస్తోందని సత్యకుమార్ చెప్పారు. ఆరోగ్య రంగానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సమర్థవంతంగా వినియోగిస్తున్నామని, సానుకూల ఫలితాలు వచ్చే విధంగా నిధుల వినియోగం ఉందని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య భద్రత తన బాధ్యత అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
