Let's talk: editor@tmv.in
ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్నాం: ప్రధాని మోడీ

ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్నాం: ప్రధాని మోడీ

Pinjari Chand
2 నవంబర్, 2025

డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రంలో అభివృద్ధి పరిగెడుతుందని, మంచి రోజులొచ్చాయని ప్రధాని అన్నారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఏర్పాటుకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాయ్‌పూర్‌లో నిర్వహించిన రజత మహోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి రూ.14,260 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, పునాది రాళ్లు వేశారు. వీటిలో రోడ్లు, విద్యుత్‌, పరిశ్రమలు, ఆరోగ్య రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అటల్ జీ సర్కార్ ఛత్తీస్​గడ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఈ రాష్ట్రం భవిష్యత్ లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. ఈరోజు అభివృద్ధిలో వికాసం చెందింది. ఇక్కడ విధానసభను కొత్తగా నిర్మించుకున్నాం. అలాగే పేదప్రజలకోసం అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. 25 సంవత్సరాల కిందట కేవలం ఒకటే మెడికల్ కాలేజీ ఉండింది. ఈరోజు 14 కాలేజీలు వచ్చాయని గుర్తు చేశారు. 5500 పైగా ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఆసుపత్రులు ఉన్నాయి. అలాగే పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ప్రతి గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించాం. మేం ఇక్కడ అభివృద్ధి చేయడానికి నిరంతరం పని చేస్తున్నాం. డాటా వచ్చింది. గ్యాస్ వచ్చింది. పేదలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. దళితులు, అణగారిన వర్గాలు అందరికీ గ్యాస్ వచ్చిందని గుర్తు చేశారు. పైపులైన్ల తో గ్యాస్ అందించాలని మేం ప్రయత్నం చేస్తున్నామన్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద 3.51 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. మరో 3 లక్షల మందికి రూ.1,200 కోట్లు మొదటి విడతగా నిధులు విడుదల చేశారు. ఈ వేడుకలో సీఎం విష్ణు దేవ్ సాయి రాష్ట్ర సాంప్రదాయ ‘గమ్ఛా(ఒక రకమైన శాలువా లేదా పట్కా)’ను ప్రధానికి అందజేశారు.

రోడ్ల రంగంలో భారీ ప్రాజెక్టులు

ఇది భారత్ మాల పరియోజనలో భాగంగా రూ.3,150 కోట్లతో పాఠల్గావ్–కుంకురి–ఛత్తీస్‌గఢ్-జార్ఖండ్ సరిహద్దు మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఫోర్‌లేన్ హైవేకు పునాది వేశారు. ఈ మార్గం ద్వారా కొర్బా, రాయ్‌గఢ్‌, జశ్‌పూర్‌, రాంచీ, జంషెడ్‌పూర్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాలు కలుస్తాయి.

బస్తర్‌, నారాయణపూర్‌, ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు.

విద్యుత్‌–ఎనర్జీ రంగంలో

తూర్పు–పడమర విద్యుత్‌ గ్రిడ్‌లను కలిపే ఇంటర్‌-రీజినల్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్‌ ప్రసరణ సామర్థ్యం పెరుగుతుంది. రూ.3,750 కోట్ల విలువైన విద్యుత్‌ ప్రాజెక్టులు మొదలయ్యాయి. రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ స్కీమ్‌ కింద రూ.1,860 కోట్ల పనులు పూర్తి చేశారు. రూ.480 కోట్లతో నిర్మించిన 9 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ప్రారంభం కాగా, మరో రూ.1,415 కోట్ల కొత్త సబ్‌స్టేషన్లకు పునాది వేశారు.

పెట్రోలియం–గ్యాస్‌ రంగం

రూ.460 కోట్ల వ్యయంతో నిర్మించిన హెచ్‌పీసీఎల్‌ ఆయిల్‌ డిపో (రాయ్‌పూర్‌) ప్రారంభించారు. 54,000 కిలోలీటర్ల ఇంధన నిల్వ సామర్థ్యంతో ఉంటుందని మోదీ తెలిపారు.రూ.1,950 కోట్లతో నిర్మించిన 489 కిలోమీటర్ల నాగ్‌పూర్‌–ఝార్సుగుడా నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ను దేశానికి అంకితం చేశారు. దీని ద్వారా 11 జిల్లాలు జాతీయ గ్యాస్‌ గ్రిడ్‌కు అనుసంధానమవుతాయి. రెండు స్మార్ట్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలు (జాంజ్‌గిర్-చాంపా, రాజ్‌నంద్‌గావ్‌)లకు శంకుస్థాపన చేయగా, నావా రాయ్‌పూర్‌ అటల్‌ నగరంలో ఫార్మా పార్క్‌ను ప్రారంభించారు.

ఆరోగ్య రంగంలో పెద్ద అడుగు

మోడీ ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు (మనేంద్రగఢ్‌, కబీర్ధమ్‌, జాంజ్‌గిర్-చాంపా, గీడం, బిలాస్‌పూర్‌లో ఆయుర్వేద కళాశాల) పునాది వేశారు. ఇవి వైద్య విద్య, ప్రజా ఆరోగ్య సేవలకు కొత్త దిశను చూపుతాయని తెలిపారు.