Let's talk: editor@tmv.in
ప్రజలను మూర్ఖులనుకుంటున్నారా?

ప్రజలను మూర్ఖులనుకుంటున్నారా?

Pinjari Chand
30 సెప్టెంబర్, 2025

ఆసియా కప్‌పై బీజేపీ నాటకాలు ఆడుతుందని, పదిహేను రోజుల క్రితం సీరిస్​ ప్రారంభంలో పాకిస్థాన్​ మంత్రి మొహిసిన్​ నఖ్వీతో కరచాలనం చేసి,నవ్వతూ ఫోటోలు దిగిన క్రికెటర్లు ఇప్పడెందుకు జాతీయవాద డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలను మూర్ఖులుగా భావిస్తున్నారా? అని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్​రౌత్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, ఇండియన్​ టీం పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజమైన దేశభక్తులు నిన్నటి మ్యాచ్​ ను చూడలేదని, నకిలీ బీజేపీ దేశభక్తుల గురించి నాకు తెలియదని బీజేపీ నాయకులకు చురకలంటించారు. టోర్నమెంట్​ కు ముందు ఇండియన్​ కప్టెన్​ సూర్యకుమార్​యాదవ్ పీసీబీ(పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ) చీఫ్‌తో కరచాలనం చేశారని అందుకు సంబంధించిన ఓ వీడియోను ఈ సందర్భంగా ఎంపీ సంజయ్​ రౌత్​ ఎక్స్​‌లో షేర్ చేశారు. ఇప్పడు ట్రోఫీ తీసుకోలేదు. షేక్​ హ్యండ్​ చేయలేదని డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు. అంతర్జాతీయ మీడియా ముందు ఎందుకు కలరింగ్ ఇస్తున్నారు. నిజంగా మీలో దేశభక్తి ఉంటే మ్యాచ్​లు ఎందుకు ఆడారు. దేశభక్తి మీ రక్తంలో ఉంటే పాకిస్థాన్​ తో ఎందుకు తలపడ్డారని దుయ్యబట్టారు. ఇకనైనా మీ నాటకాలకు తెరదింపండన్నారు. పహాల్గాం ఉగ్రదాడిలో మరణించిన ప్రజలను, అమరులైన సైనికులను అవమానించకూడదని భావిస్తే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే వారే కాదన్నారు.

ఐసీసీ చైర్మన్​ జై షా ఏం చేస్తున్నారు

కేంద్ర హోంమంత్రి అమిత్​షా కుమారుడైన జైషా ఐసీసీ చైర్మన్​గా ఉన్నారు. పహాల్గాం దాడికి బదులుగా ఆసియాకప్ టోర్నీ నుంచి పాకిస్థాన్​ను ఎందుకు బహిష్కరించలేదని మహారాష్ట్ర కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అతుల్ లోండే పాటిల్​ ప్రశ్నించారు. ఈ మ్యాచ్​లు ఐసీసీ నిర్వహించిందని అమిత్​షా అంటున్నారు. అక్కడ అధ్యక్షుడిగా ఉన్నది తన కోడుకే కదా ఎందుకు పాకిస్థాన్​ను తొలగించలేదన్నారు. ఆపరేషన్​ సింధూర్​ ముగిసిందా? లేకుంటే క్రికెట్ మ్యాచ్​ గెలవగానే ఆపరేషన్​ లో భాగమని చెబుతారా? ఇరు దేశాల మధ్య సంబంధాలను కొనసాగించడానికి మ్యాచ్​లు ఆడారా? లేక డబ్బు కోసమే ఇదంతా డ్రామాలు జరుగుతున్నాయా అని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆసియాకప్​ వివాదం రాజకీయరంగు పులుముకుంది.

ప్రజలను మూర్ఖులనుకుంటున్నారా? - Tholi Paluku