Let's talk: editor@tmv.in
పోలీస్ అథారిటీ లోగో ఆవిష్కరణ

పోలీస్ అథారిటీ లోగో ఆవిష్కరణ

Pinjari Chand
17 అక్టోబర్, 2025

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లెయింట్ అథారిటీ(ఎస్పీసీఏ) కి సంబంధించి రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్‌ను, లోగోను ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి , హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్, సీజీజీ డీజీ రవి గుప్త , ఎస్పీసీఏ చైర్మన్ జస్టిస్ బి. శివశంకర్ రావుతో పాటు ఇతర సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు పోలీసులపై ఉన్న ఫిర్యాదులను సులభంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చు. పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను బలోపేతం చేయడం ఈ అథారిటీ లక్ష్యమని అధికారులు తెలిపారు.

పోలీసులపై కూడా ఫిర్యాదు చేయొచ్చు

ప్రభుత్వం ఎస్పీసీఏ అధికారి ప్రకారం, ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు పోలీసులపై ఫిర్యాదులు నమోదు చేయడం సులభమవుతుందని, పారదర్శకత పెరుగుదలతోపాటు పోలీస్ వ్యవస్థపై జవాబుదారీతనం బలపడుతుందని ఆశిస్తున్నారు. దీనితో ఉన్నతాధికారుల దర్యాప్తు, ఫిర్యాదు పరిష్కార ప్రక్రియల్లో సమయపాలన, కేసు ట్రాకబిలిటీ మెరుగుపడనుంది. ఎస్పీసీఏ ప్రధాన ఉద్దేశ్యం పోలీసులపై, ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారుల (డీఎస్పీర్యాంక్‌ పైగా) పై ప్రజల ఫిర్యాదులను స్వతంత్రంగా స్వీకరించి విచారణ చేయడం. ఇది సాధారణ పోలీస్ శాఖలో ఉండే అంతర్గత దర్యాప్తు కంటే బయట ఉన్న స్వతంత్ర సంస్థ. ప్రజలు పోలీసుల ప్రవర్తన, దౌర్జన్యం లేదా అధికారం దుర్వినియోగం వంటి అంశాలపై నేరుగా ఎస్పీసీఏ కి ఫిర్యాదు చేయవచ్చు.

పోలీస్ అథారిటీ లోగో ఆవిష్కరణ - Tholi Paluku