Let's talk: editor@tmv.in
పోలీసుల పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌ పట్ల జాగ్రత్త!: సజ్జనార్‌

పోలీసుల పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌ పట్ల జాగ్రత్త!: సజ్జనార్‌

Gaddamidi Naveen
22 అక్టోబర్, 2025

మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడొద్దని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ నకిలీ కాల్‌తో కూడిన వీడియోను ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్‌ నేరగాళ్లకు వరంలా మారుతున్నాయి. ఈ నేరాలకు చెక్ పెట్టాలంటే అవగాహనతో కూడిన అప్రమత్త అవసరం. మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్‌ చేయొద్దు అని తెలిపారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి అని ఆయ‌న సూచించారు. ఈ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు కాల్‌ చేయడం ద్వారా గానీ, జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ http://cybercrime.gov.inలో గానీ ఫిర్యాదు చేయండి అని విజ్ఞప్తి చేశారు.

పోలీసుల పేరుతో ఫోన్ మోసాలు- త‌ర‌హా కేసులు

• దొంగలు తప్పుడు పోలీసు ఐడెంటిటీ (ID) ఉపయోగించి బాధితులకు ఫోన్ చేస్తారు.

• మీ అకౌంట్/పాస్‌పోర్ట్/ఆధార్‌లో ఏదో సమస్య ఉంది, మీకు కేసు పెట్టబడింది, వెంటనే డబ్బు/బ్యాంక్ డీటెయిల్స్ పంపాలి అంటారు. ఇది ముఖ్యంగా పెద్ద వయస్సు గల వ్యక్తులు, ఉద్యోగులు, విద్యార్థులు లక్ష్యం అవుతారు.

హైదరాబాద్ సిటీ కేసులు

• 2019–2023 మ‌ధ్య‌ సైబర్ క్రైమ్ విభాగం ప్రకారం,హైద‌రాబాద్ సిటీ పోలీస్ 100 నుంచి 200 కంటే ఎక్కువ కేసులు ప్రతి సంవత్సరం నమోదు అయినట్లు తెలిపారు.

• 2022లో ఫేక్ సిబిఐ/పోలీసు కాల్స్ ద్వారా 50 మందిని మోసం చేసిన కేసులు వెలుగులోకి వచ్చాయి.

• ఆ కాలంలో పోలీసులు సిమ్‑బాక్స్/ఫోన్ స్పూఫింగ్ పై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి

• తెలంగాణలో చాలా మంది మోసపూరిత కాల్స్ బాంక్ అకౌంట్లకు లేదా క్రెడిట్/డెబిట్ కార్డ్లకు సంబంధించి వచ్చాయి.

• పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం 2018–2023 మధ్య‌ సుమారుగా 300 నుంచి 500 ఫేక్ పోలీస్/సెట్రల్/స్కామ్ ఫోన్ కేసులు నమోదయ్యాయి. అలాగే అరెస్టులు కూడా న‌మోదు జరిగాయి, చాలా దొంగలను స్థానిక నెంబర్‌/SIM కార్డుల‌ ద్వారా గుర్తించారు.

పోలీసుల పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌ పట్ల జాగ్రత్త!: సజ్జనార్‌ - Tholi Paluku